Indians: ఇండియన్స్ సేఫ్.. విడుదల చేసిన తాలిబాన్లు

భారతీయ పౌరులతో సహా మొత్తం 150 మంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సురక్షితంగా చేరుకున్నారు.

Taliban

Talibans: అఫ్ఘానిస్థాన్‌లో కిడ్నాపైన భారతీయ పౌరులతో సహా మొత్తం 150 మంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సురక్షితంగా చేరుకున్నారు. ఆఫ్ఘన్ మీడియా ప్రకారం, సదరు వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను తనిఖీ చేసిన తర్వాత తాలిబాన్లు వారిని విడిచిపెట్టారు. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెళ్లువెత్తడంతో వారిని వెంటనే కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలించినట్టు తెలుస్తోంది.

అంతకుముందు కిడ్నాప్ చేసిన వారందరినీ.. ఆల్‌కొజై గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు చెందిన ఆఫీసుల్లో నిర్భందించారు తాలిబన్‌ టెర్రరిస్టులు. వారివద్ద నుంచి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. భారతీయులతో పాటు మరికొందరు విదేశీయులను తాలిబన్‌లు కిడ్నాప్‌ చేశారనే సమాచారంతో అన్ని దేశాల బలగాలు అప్రమత్తం అయ్యాయి‌. అమెరికా సైనిక బలగాలు తాలిబన్ల కోసం వేటను ప్రారంభించగా.. అమెరికా బలగాలతో పాటు అఫ్ఘాన్ సైనికులు తమకోసం వేటాడుతున్నాయన్న ఇన్‌ఫర్మేషన్‌ తెలుసుకోగానే తాలిబన్‌లు భయపడ్డారు. వెంటనే తామెవరినీ కిడ్నాప్‌ చేయలేదని, అందరినీ కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నట్టుగా అధికార ప్రతినిధులతో ప్రకటన చేయించారు.


తాలిబన్‌ టెర్రరిస్టులు కిడ్నాప్‌ చేసిన విదేశీయల కోసం.. అఫ్ఘాన్‌ సెక్యురిటీ ఫోర్స్‌, యూఎస్‌, ఇరాన్‌, ఉజ్బెకిస్థాన్‌ బలగాలు గాలింపు చేపట్టాయి. ముమ్మరంగా గాలింపు ప్రక్రియ సాగుతున్న సమయంలో తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రదేశాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దీంతో అక్కడి నుంచి తాలిబన్లు పరుగులు పెట్టారు. తాము ఇప్పటివరకూ చేసిన ప్రయత్నమంతా విఫలం అవుతుందని భావించి తాలిబన్లు వెంటనే.. 150మంది భారతీయులతో సహా అందరినీ కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలించారు.