Taylor Swift Wedding: రిటన్ గిఫ్ట్ గా వజ్రాలు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే..
పాప్ సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్(Taylor Swift Wedding), ఎన్‌ఎఫ్ఎల్ ఆటగాడు ట్రావిస్ కెల్సీ వివాహ బంధంతో ఒకటయ్యారు.
- V Santhosh Kumar
- Published on- July 4, 2026 / 04:23 PM IST
Taylor Swift And Travis Kelce Wedding Guests Receive Diamond Encrusted Gifts goes viral
- టేలర్ స్విఫ్ట్ వైభవంగా వివాహం
- మాడిసన్ స్క్వేర్‌లో గ్రాండ్ వెడ్డింగ్
- సెలబ్రిటీల సమక్షంలో రిహార్సల్ డిన్నర్
Taylor Swift Wedding: పాప్ సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్, ఎన్‌ఎఫ్ఎల్ ఆటగాడు ట్రావిస్ కెల్సీ వివాహ బంధంతో ఒకటయ్యారు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్(Taylor Swift Wedding) గార్డెన్‌లో జూలై 3న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అంతకుముందు గురువారం రాత్రి సెలెనా గోమెజ్, గిగి హడిద్, బ్రాడ్లీ కూపర్ వంటి హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ రిహార్సల్ డిన్నర్ నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన అతిథులకు “TT” అనే అక్షరాలతో కూడిన నల్లటి వెల్వెట్ గిఫ్ట్ బాక్సులను బహుమతిగా ఇచ్చారు. ఈ బాక్సులలో వజ్రాలు పొదిగిన షాంపేన్ గ్లాసులతో పాటు, కెల్సీ తన బ్యాక్‌యార్డ్‌లో టేలర్‌కు ప్రపోజ్ చేసినప్పటి అందమైన ఫోటోలు, వెండి వ్యాక్స్ సీల్‌తో కూడిన ప్రత్యేక కార్డులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ వేడుకలో ఈ జంట ప్రముఖ డిజైనర్ జోనాథన్ ఆండర్సన్ రూపొందించిన క్రిస్టియన్ డియోర్ హాట్ కోచర్ దుస్తులలో మెరిసిపోయారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వెలుపల ఉన్న జంబోట్రాన్ స్క్రీన్‌లపై “JUST & MARRIED” అని ప్రదర్శిస్తూ వీరిద్దరూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్విఫ్టీస్ న్యూయార్క్‌కు తరలివచ్చారు. టేలర్ స్విఫ్ట్‌కు ట్రావిస్ కెల్సీ సరైన జోడీ అని, ఆమె కలల యువకుడు అతడేనని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీరిద్దరి ప్రేమ ప్రయాణం 2023లో రహస్య డేటింగ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత ఒకరికొకరు కచేరీలు, మ్యాచ్‌లలో మద్దతుగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. చివరకు ఆగస్టు 2025లో వీరి నిశ్చితార్థం జరిగింది. “మీ ఇంగ్లీష్ టీచర్, జిమ్ టీచర్ పెళ్లి చేసుకోబోతున్నారు” అంటూ అప్పట్లో వారు పెట్టిన ఉమ్మడి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కాగా, ఇప్పుడు వీరి వివాహ వార్త ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
