Telangana Techie Killd Wife : భార్య హత్య.. ప్రియురాలికి డెడ్‌బాడీ ఫోటో.. 9నెలల తరువాత బిగ్ ట్విస్ట్.. అమెరికాలో తెలంగాణ టెకీ దారుణం..

Telangana Techie Killd Wife : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవినాష్ నార్నేపై భార్య రాజిత సబ్బినేని (27) హత్య కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Telangana Techie Avinash narne wife murder case US

Telangana Techie Killd Wife : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవినాష్ నార్నేపై భార్య రాజిత సబ్బినేని (27) హత్య కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తొమ్మిది నెలల పాటు సాగిన దర్యాప్తు అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర చట్టాల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : BBL : చెన్నైలో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్.. ప్రధాని నరేంద్ర మోదీ భారీ ప్రకటన..

తెలంగాణకు చెందిన టెకీ అవినాశ్ నార్నే, రాజిత సుబ్బినేని భార్యాభర్తలు. వారికి గతేడాది ప్రారంభంలోనే వివాహంజరిగింది. అయితే, గతేడాది అక్టోబర్ నెలాఖరున తన భార్య బాత్రూం లోపల తాళం వేసుకుందని, ఎంత పిలిచినా పలకడం లేదని రాత్రి సమయంలో బెల్వ్యూ పోలీసులకు నార్నే ఫోన్ చేశాడు. హుటాుహటీన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. బాత్రూంలోకి బలవంతంగా ప్రవేశించి చూడగా.. రాజిత నేలపై పడిఉంది. వెంటనే ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

రాజిత సుబ్బినేని మృతదేహానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా.. గొంతు నులమడం వల్ల ఊపిరాడకపోవడంతో మరణించినట్లు తేలింది. దీంతో ఆమెది హత్యగా నిర్ధారించిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు సమయంలో భర్త అవినాశ్ పై అనుమానం వచ్చినప్పటికీ తప్పుడు వాదనలతో పోలీసులను డైవర్ట్ చేశాడు.

అవినాశ్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. రాజిత చనిపోయిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని.. బయటకు వెళ్లి 40 నిమిషాల తరువాత తిరిగి వచ్చానని నార్నే డిటెక్టివ్ లకు చెప్పాడు. తాను వచ్చేసరికి బాత్రూమ్ లో తాళం వేసి ఉండటాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. నార్నే బయటకు వెళ్లినట్లు రికార్డయింది.. అయితే, అతను బయటకు వెళ్లిన తరువాత మరొకరు ఎవరూ ఇంటి లోపలికిరాలేదు. దీంతో అవినాశ్ నార్నే ఏదో దాస్తున్నాడని అక్కడి పోలీసులు గుర్తించారు.

నార్నే ఫోన్‌ను చెక్ చేయగా.. ఇండియాలోని తన ప్రియురాలికి ఫోన్లు, మెస్సేజ్ లు చేసినట్లు గుర్తించారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. అవినాశ్ అతని ప్రియురాలికి చాలాకాలంగా పరిచయం ఉంది. పెండ్లి జరిగిన తరువాత కూడా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అవినాశ్ నార్నే పెండ్లికి అతని ప్రియురాలుకూడా వచ్చినట్లు ఫోటోలను గుర్తించారు. భార్య అడ్డు తొలగించుకొని ప్రియురాలితో కలిసి ఉండేందుకు అవినాశ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు.. అవినాశ్ తన భార్యను హత్య చేసిన మరుసటి రోజు భార్య మృతదేహం ఫొటోను ప్రియురాలికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు.

సుబ్బినేని హత్యకు ముందు భార్య, భర్తల మధ్య జరిగిన ఫోన్ మెస్సేజ్‌లను పోలీసులు ట్రేస్ చేశారు. నార్నే చేసి ఇచ్చిన స్మూతీలు చేదుగా ఉన్నాయని పలుమార్లు చెప్పినట్లు ఛాటింగ్ ఆధారంగా తెలిసింది. చనిపోయిన రోజు తాగిన స్మూతీ.. మందు కలిసినట్లుగా.. దగ్గు టానిక్ లాగా ఉందని ఆమో ఆరోపించినట్లు చెప్పారు. అధికారులు ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు, భార్యకు ఒంట్లో బాగోలేదని, దగ్గు మందు తాగిన తర్వాత కుప్పకూలిపోయి ఉండవచ్చని నార్నే వారితో సూచించారు. అయితే, తొమ్మిది నెలలపాటు పలు విధాలుగా దర్యాప్తు చేసిన తరువాత నిందితుడు అవినాశ్ నార్నేగా పోలీసులు నిర్ధారించారు.

హత్యముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందన్న ప్రాసిక్యూటర్ల ఆరోపణను అంగీకరించిన కోర్టు.., జూలై 1న అవినాశ్ నార్నేపై అధికారికంగా ఫస్ట్-డిగ్రీ మర్డర్ ఛార్జెస్ ను నమోదు చేసింది. ఆయన నిర్దోషినని వాదించగా, కేసు విచారణ కొనసాగుతోంది.