Telugu-origin Sirisha Bandla : తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మహిళ.. ఆమె ఎవరంటే?

అంతరిక్ష యానంలో తొలిసారిగా తెలుగు మహిళ ప్రయాణించబోతోంది. జూలై 11న స్పేస్ క్రాఫ్ట్ ‘యూనిటీ -22’ను లాంచ్ చేయనున్నట్టు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) ప్రకటించింది.

Telugu Origin Sirisha Bandla

Virgin Galactic flight to space : అంతరిక్ష యానంలో తొలిసారిగా తెలుగు మహిళ ప్రయాణించబోతోంది. జూలై 11న స్పేస్ క్రాఫ్ట్ ‘Unity22’ను లాంచ్ చేయనున్నట్టు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) ప్రకటించింది. సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్​ (Richard Branson)తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నారు. ఈ బృందంలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన తెలుగు మూలాలు ఉన్న శిరీష బండ్ల అనే మహిళ కూడా ఉన్నారు.

Virgin Galactic ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ తన రాకెట్ షిప్‌ను ఒక విమానం నుంచి ప్రయోగించి, సుమారు 55 మైళ్ళు (88 కిలోమీటర్లు) ఎత్తుకు చేరుతుంది. వర్జిన్ గెలాక్సీ ద్వారా ప్రయాణించే విమానం సుమారు 10 నిమిషాలు అక్కడే ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు చెందిన శిరీష (34) కుటుంబం వాషింగ్టన్​లో స్థిరపడింది. చాలా యేళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిపోయారు. అనురాధ, డాక్టర్ మురళీధర్ బండ్లా దంపతుల కుమార్తె.. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్​లో శిరీష డిగ్రీ పొందారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్​లో ఉపాధ్యక్షురాలిగా శిరీష కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే బ్లూ ఆర్జిన్ సంస్థ ద్వారా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈనెల 20న అంతరిక్షానికి వెళ్లనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. బెజోస్ సంస్థకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ కూడా అంతరిక్ష పయనానికి సిద్ధమైంది. ఇందులో తెలుగు మూలాలు కలిగిన మహిళ కూడా ఒక వ్యోమగామిగా అంతరిక్షానికి వెళ్లనున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 2020లో శిరీషాకు తానా యూత్ స్టార్ అవార్డును అంతరిక్ష పరిశోధన రంగంలో సాధించినందుకు ప్రదానం చేసింది.