Climate Disasters
Climate Disasters: ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ విపత్తుల వల్ల 10 లక్షల మంది పిల్లలు మరణించారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ సంచలన నివేదికను తాజాగా వెల్లడించింది. వరదలు, తుపాన్లు, కరవు, అడవుల్లో కార్చిచ్చుల వల్ల 10 లక్షల మంది మృత్యువాత పడ్డారు. గ్లోబల్ వార్మింగ్, విపత్తుల కారణంగా 2016 వ సంవత్సరం నుంచి 2021 వరకు 44 దేశాల్లో 43.1 మిలియన్ల పిల్లలు స్థానభ్రంశం చెందారని యూఎన్ చిల్డ్రన్స్ ఫండ్ వెల్లడించింది.
Also Read : Pakistan : పాకిస్థాన్‌లో కలకలం…4 లక్షల మందికి కండ్లకలక
బాధితుల పట్ల శ్రద్ధ చూపించడం లేదని చిల్డ్రన్స్ ఫండ్ ఆందోళన వ్యక్తం చేసింది. కొంతమంది బాధిత పిల్లల హృదయాలను కదిలించే కథనాలను రచయిత లారాహీలీ వెల్లడించారు. గ్రామంలో వరదలు వెల్లువెత్తడంతో పడవపై ఇంట్లో వస్తువులను జాతీయ రహదారిపైకి తరలించి అక్కడే రోడ్డు వారం రోజుల పాటు నివసించామని సూడానీస్ పిల్లవాడు ఖలీద్ అబ్దుల్ అజీమ్ వివరించాడు. 2017వ సంవత్సరంలో సోదరీమణులు మియా, మైయా బ్రావో కాలిఫోర్నియాలోని తమ ఫ్యామిలీ మినీవాన్ వెనుక నుంచి మంటలు చుట్టుముట్టడాన్ని వీక్షించారు.
Also Read :Manipur : కల్లోల మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
మంటలు చూసి తాము భయపడ్డామని ఆ సోదరీమణులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ 20వేల మంది పిల్లలు స్థానభ్రంశం చెందుతున్నారని హీలీ చెప్పారు. పొంగి పొర్లుతున్న నదులు, వరదలతో రాబోయే 30 ఏళ్లలో 96 మిలియన్ల మంది పిల్లలు స్థానభ్రంశం చెందుతారని నివేదిక తెలిపింది. తుపాన్ల వల్ల 10.3 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందుతారని నివేదిక పేర్కొంది. నవంబర్, డిసెంబరులో దుబాయ్‌లో జరిగే కాప్ 28 వాతావరణ సదస్సులో ఈ సమస్యను పరిష్కరించాలని యునిసెఫ్ ప్రపంచ నాయకులను కోరింది.
Also Read : Drone Attack : సిరియన్ మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి…100 మందికి పైగా మృతి, 125 మందికి గాయాలు
చైనా, భారతదేశం, ఫిలిప్పీన్స్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో అంటే 23 మిలియన్ల మంది పిల్లలు స్థానభ్రంశం చెందారని నివేదిక వివరించింది. ఆఫ్రికా చిన్న ద్వీప దేశాలైన డొమినికాలో 2016 నుంచి 2021 వ సంవత్సరం వరకు 76 శాతం మంది స్థానభ్రంశం చెందారు. క్యూబా, సెయింట్ మార్టిన్లలో 30 శాతం మంది పిల్లలు విపత్తులతో బాధ పడ్డారు.