22 ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి: పాక్ బండారం బట్టబయలు

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దేశం పాకిస్తాన్. టెర్రరిస్టులను పాక్ పెంచి పోషిస్తోంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పాక్ మాత్రం తమ దేశంలో ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు జరగడం లేదని అబద్దాలు చెబుతుంది.

  • Publish Date - March 9, 2019 / 02:11 AM IST

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దేశం పాకిస్తాన్. టెర్రరిస్టులను పాక్ పెంచి పోషిస్తోంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పాక్ మాత్రం తమ దేశంలో ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు జరగడం లేదని అబద్దాలు చెబుతుంది.

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దేశం పాకిస్తాన్. టెర్రరిస్టులను పాక్ పెంచి పోషిస్తోంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పాక్ మాత్రం తమ దేశంలో ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు జరగడం లేదని అబద్దాలు చెబుతుంది. పాక్ బండారం మరోసారి బట్టబయలైంది. పాక్ లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని, వాటిలో 9 శిబిరాలు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవేనని సీనియర్‌ భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిరాలపై పాక్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్‌లో అన్నారు. దేశంలో మళ్లీ ఏమైనా ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగితే భారత ప్రభుత్వం బాలాకోట్‌ తరహా దాడులు చేయడం ఖాయమని పాకిస్తాన్‌ను ఆయన హెచ్చరించారు.
Read Also : ఇమ్రాన్ మాటలేనా: ఉగ్రవాదంపై.. నయా పాక్.. నయా యాక్షన్ చూపించు

‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రం పాకిస్తాన్‌. తీవ్రవాదులు, తీవ్రవాద సంస్థలపై పాక్ నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆ అధికారి అన్నారు. పాక్ గడ్డపై 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నా వాటిపై ఏ చర్య తీసుకోని పాకిస్తాన్‌ ప్రభుత్వం తమ దేశంలో తీవ్రవాదులు లేరని బుకాయిస్తోందని మండిపడ్డారు. 2 దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బాలాకోట్‌పై భారత్‌ దాడి ఉగ్రవాద వ్యతిరేక చర్య అని ఆ అధికారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే దాడి జరిగిందన్నారు.

పాక్‌ ప్రభుత్వం ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాక్‌ ఇలాగే చేస్తుందని, ఇందులో విశేషమేమీ లేదని అన్నారు. ఉగ్రవాదులను గృహ నిర్బంధంలో ఉంచడమంటే వారికి విలాసాలు సమకూర్చడమేనని, పరిస్థితి సద్దుమణగగానే వారిని విడిచిపెడుతుందని చెప్పారు. భారత్‌పై ఉగ్ర దాడికి పాక్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని బాలాకోట్‌ దాడి ద్వారా భారత్‌ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ట్రంప్‌ సర్కార్ భారత్‌కు మద్దతిస్తోందన్నారు.
Read Also : 16 నెలల తర్వాత : లండన్‌లో నీరవ్ మోడీ ఆచూకీ లభ్యం