టెర్రర్ హంట్ : శ్రీలంకలో ఉగ్రవాదులపై కమాండో ఆపరేషన్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్ర దాడులు నేషనల్ తౌహీద్ జమాత్ పనిగా పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన

  • Publish Date - April 21, 2019 / 04:00 PM IST

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్ర దాడులు నేషనల్ తౌహీద్ జమాత్ పనిగా పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్ర దాడులు నేషనల్ తౌహీద్ జమాత్ పనిగా పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. టెర్రరిస్టులపై కమాండో ఆపరేషన్ చేపట్టారు. కొలంబోలోని ఓ ఇంట్లో ముష్కరులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు.

ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఈస్టర్ పండుగ. క్రైస్తవులకు పర్వదినం. సరిగ్గా ఈస్టర్ రోజున కొలంబోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా బాంబులు పేల్చారు. రక్తపుటేరులు పారించారు. బాంబు పేలుళ్లలో 217మంది చనిపోయారు. 500మంది గాయపడ్డారు. మృతుల్లో 35మంది విదేశీయులు ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు భారతీయులను గుర్తించారు. ఆదివారం ఉదయం 8.45 గంటలకు తొలి బాంబు పేలింది. ఆ తర్వాత 6 గంటల వ్యవధిలో 9 చోట్ల బాంబులు పేలాయి. ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది.