Tesla Flying Car : ఇక ట్రాఫిక్‌లో ఎగిరిపోవచ్చా? గాల్లోకి ఎగిరిన టెస్లా కారు.. ఒక్క వీడియోతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఎలాన్ మస్క్..

Tesla Flying Car : కార్లు రోడ్డుపై దూసుకెళ్లడమే కాదు.. తలకిందులుగా ప్రయాణిస్తూ గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది? ఇలాంటి దృశ్యాలు హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం.. కానీ, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ అద్భుతం సృష్టించింది.

Tesla Flying Car

Tesla Flying Car : కార్లు రోడ్డుపై దూసుకెళ్లడమే కాదు.. తలకిందులుగా ప్రయాణిస్తూ గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది? ఇలాంటి దృశ్యాలు హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం.. కానీ, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ అద్భుతం సృష్టించింది. గాలిలోకి ఎగురుతూ ప్రయాణించే కారును తయారు చేసింది.. ఇందుకు సంబంధించిన వీడియోను మస్క్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. కొత్తగా రూపొందించిన టెస్లా రోడ్‌స్టర్ కారుతో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : Slowest Train in India : సైకిల్ కన్నా మెల్లగా వెళ్లే రైలు.. ఇండియాలో నెమ్మదిగా ప్రయాణించే రైలు ఇదే.. 46 కి.మీ ఎన్ని గంటలు పడుతుందో తెలుసా?

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం మెక్‌గ్రెగర్‌లో ఉన్న స్పేస్‌ఎక్స్ కేంద్రంలో అక్టోబర్ 15న టెస్లా ఈ కారు ప్రదర్శనను నిర్వహించారు. కొత్త రూపంలో రూపొందించిన రోడ్‌స్టర్ కారును భారీ వంపుతో కూడిన ప్రత్యేక ర్యాంప్‌పైకి ఎక్కించారు. ఆ తర్వాత కారు తలకిందులుగా ప్రయాణిస్తూ, గాల్లోకి ఎగిరి, మళ్లీ సురక్షితంగా నేలపైకి దిగింది. ఇతర టెస్లా వాహనాలపై నుంచి గాల్లో ప్రయాణించే విన్యాసం కూడా ఈ ప్రదర్శనలో భాగంగా కనిపించింది. ఈ కారు వీడియోను మస్క్ షేర్ చేస్తూ.. భవిష్యత్తులో ఎగిరే కార్లు ఉంటాయని స్పష్టమైంది అంటూ రాసుకొచ్చాడు.

ఈ రోడ్‌స్టర్‌లో స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఉపయోగించినట్లు సమాచారం. అధిక పీడనంతో నిల్వ చేసిన వాయువును ప్రత్యేక థ్రస్టర్ల ద్వారా విడుదల చేయడం ద్వారా కారు గాల్లోకి లేచేలా వ్యవస్థను రూపొందించారు. సాధారణ కార్లతో సాధ్యం కాని కొన్ని విన్యాసాలను ఈ సాంకేతికతతో ప్రదర్శించారు. ఈ కారులో ప్రొపల్షన్ వ్యవస్థలో రెండు అల్ట్రా హై ప్రెజర్ ఎయిర్ ట్యాంకులు ఉన్నాయి. ఒక్కోదాంట్లో దాదాపు 250 కిలోల వాయువు ఉంటుంది. కేవలం సెకను కంటే తక్కువ సమయంలోపే ఇది 60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదని టెస్లా ప్రతినిధులు పేర్కొన్నారు.


టెస్లా తదుపరి తరం రోడ్‌స్టర్‌ను తొలిసారిగా 2017లో ప్రకటించింది. అయితే, దీని తయారీ ప్రణాళిక పలుమార్లు ఆలస్యమైంది. తాజా ప్రకటనల ప్రకారం, ఈ కొత్త మోడల్ ఉత్పత్తిని 2028లో ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ధర, పూర్తి సాంకేతిక వివరాలు, మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ఖచ్చితమైన తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.