Viral Video : లైవ్‌లో చేసిన తప్పిదానికి సోషల్ మీడియాలో క్షమాపణలు కోరిన యాంకర్
టీవీ లైవ్ ప్రసారంలో యాంకర్లు అలెర్ట్‌గా లేకపోతే ఎదురయ్యే సంఘటనలు ఇదివరకు అనేకం చూసాము. తాజాగా ప్రముఖ ఛానెల్ యాంకర్ చేసిన చిన్న పొరపాటుకి విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కున్నారు.
- Lakshmi 10tv
- Updated on- December 7, 2023 / 06:12 PM IST
Viral Video
Viral Video : టీవీ లైవ్‌లలో యాంకర్లు అలెర్ట్‌గా లేకపోతే జరిగే తప్పిదాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. చిన్న పొరపాట్ల కారణంగా ఊహించని పరిణామాలు ఎదుర్కుంటారు. రీసెంట్గా బీబీసీ న్యూస్ యాంకర్ లైవ్ టీవీలో మధ్య వేలు చూపించిన క్లిప్ రెప్పపాటులో స్క్రీన్‌పై కనిపించింది. దాంతో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కుని చివరికి ఆ యాంకర్ క్షమాపణలు చెప్పింది.
BBC న్యూస్ యాంకర్ లైవ్‌లో మధ్య వేలును చూపిస్తూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చీఫ్ ప్రెజెంటర్ అయిన మర్యమ్ మోషిరి మధ్యాహ్నం వార్తలకు రెడీ అవుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.
లైవ్‌కి కౌంట్ డౌన్ ప్రారంభమై సున్నాకి చేరుకోవడంతో స్క్రీన్‌పై మోషిరి తన మిడిల్ ఫింగర్‌ను చూపిస్తూ కనిపించారు. విషయం అర్ధమై వెంటనే అలర్ట్ అయిన ఆమె ‘లైప్ ఫ్రమ్ లండన్.. కరోనా సమయంలో యూకే పడ్డ ఇబ్బందులు, జరిగిన నష్టానికి బ్రిటీష్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ క్షమాపణలు చెప్పారని’ న్యూస్ చదవడం మొదలుపెట్టారు. Chris Rose అనే ట్విట్టర్ యూజర్ వీడియో షైర్ చేయడంతో వైరల్‌గా మారింది. అనేకమంది ఆమె వృత్తి నైపుణ్యాన్ని ప్రశ్నించారు.
Mumbai : మాజీ మిస్ ఇండియాను పెళ్లాడిన ఆ బిలియనీర్ బ్యాంకర్ కొడుకు
ఇక ఈ వీడియోపై మోషిరి వివరణ ఇవ్వక తప్పలేదు. ‘అందరికీ హాయ్.. డైరెక్టర్ 10-0 నుండి కౌంట్ డౌట్ స్టార్ చేయడంతో నేను నా చేతి వేళ్లతో నెంబర్ చూపిస్తున్నట్లు నటిస్తున్నాను. నంబర్ 1 కి చేరుకున్నప్పుడు నేను జోక్‌గా వేలును తిప్పాను.. అది కెమెరాలో చిక్కుకుంటుందని అనుకోలేదు. ఇది టీమ్‌తో జరిగిన ఒక జోక్.. ప్రసారం అయినందుకు క్షమించండి. ఉద్దేశ పూర్వకంగా చేసినది కాదు.. నేను ఎవరినైనా కించపరిచినా, బాధ పెట్టినా క్షమించండి..’ అంటూ మోషిరి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. యాంకర్లు అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి సంఘటనలు జరగడం.. వాటికి వివరణ ఇచ్చుకోవడం తప్పదని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
