Mizoram youngest MLA : ఎమ్మెల్యేగా గెలిచిన యాంకర్.. మిజోరాం ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన యువతి

రేడియో జాకీగా, టీవీ యాంకర్ గా పనిచేసిన యువతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మిజోరాం రాష్ట్రలోనే అత్యంత చిన్న వయస్సు ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

Mizoram youngest MLA : ఎమ్మెల్యేగా గెలిచిన యాంకర్.. మిజోరాం ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన యువతి

Mizoram youngest MLA Baryl Vanneihsangi

Mizoram youngest MLA Baryl Vanneihsangi : మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఓ రేడియో జాకి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం సాధించారు బారిల్‌ వన్నెహ్ సాంగి అనే 32 ఏళ్ల యువతి. మిజోరాంలో అత్యంత చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేగా పేరొందారు. అంతేకాదు బారిల్ వన్నెహ్ ఓ రేడియో జాకీగా, టీవీ యాంకర్ గా పనిచేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఇన్ స్టా రీల్స్ చేస్తు తనకంటూ ఫాలోవర్స్ ను క్రియేట్ చేసుకున్నారు. జోరాం పీపుల్స్ మూమెంట్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి విజయం సాధించి రాష్ట్రంలోనే అతి చిన్నవయస్సు కలిగిన ఎమ్మెల్యేగా కొత్త రికార్డు సృష్టించారు.

ఇటీవల తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో మిజోరాం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబ్ 3న విడుదల అయ్యాయి.మిజోరాం ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు మాత్రం 4న విడదుల అయ్యాయి. ఈ ఫలితాల్లో బారిల్‌ వన్నెహ్ సాంగి విజయం సాధించారు. 40 మంది సభ్యులు ఉన్న మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో బారిల్‌ జెడ్‌పీఎం అభ్యర్థిగా ఐజ్వాల్‌ సౌత్‌ -III నుంచి పోటీకి దిగి .. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు.

సల్మాన్ ఖాన్‌తో కలిసి మమతా బెనర్జీ స్టెప్పులు .. దీదీ డ్యాన్స్‌కు ప్రముఖులు ఫిదా

మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థి(ఎంఎన్‌ఎఫ్‌) లాల్నున్మావియాను 9.370 మెజార్టీ ఓట్లతో ఓడించి విజయం సాధించారు. ZPM, 40 స్థానాలకు గాను 27 స్థానాలను కైవసం చేసుకొని, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)ని చిత్తు చిత్తుగా ఓడించింది. ఈక్రమంలో మిజోరాంలో ముగ్గురు మహిళలు గెలుపొందారు. వారిలో బారిల్ ఒకరు.ఈమె రాష్ట్రంలోనే అతి చిన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

బారిల్ మేఘాలయాలోని షిల్లాంగ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ను చేశారు. టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్‌ అయ్యారు. ఆమెకు ఏకంగా దాదాపు 250కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ క్రేజే ఆమె ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఉపయోగపడింది. ఆమె గతంలో ఐజ్వాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంఏసీ)లో కార్పొరేటర్‌గా పనిచేశారు.

పీఎం కిసాన్ పెంపుపై లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆమె ..లింగ సమానత్వం గురించి గట్టిగా మాట్లాడారు. మహిళలు తమ అభిరుచికి తగినట్లుగా జీవించాలని అన్నారు. మహిళలు తమ సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా సాధికారత సాధించాలని ఆకాంక్షించారు.