PM Kisan Samman : పీఎం కిసాన్ పెంపుపై లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

పీఎం కిసాన్ పెంపు విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ శాకా మంత్రి వివరణ ఇచ్చారు.

PM Kisan Samman : పీఎం కిసాన్ పెంపుపై లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

PM Kisan Samman Nidhi

Updated On : December 6, 2023 / 9:04 AM IST

PM Kisan Samman Nidhi : దేశంలోని రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇస్తున్న ఆర్థిక సహాయం పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సహాయాన్ని పెంచుతారనే వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రం వివరణ ఇచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రస్తుతం పెంచే యోచన లేదని మంత్రి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. కాగా.. రైతులకు కేంద్రం ఇచ్చే ఏడాదికి ఇచ్చే రూ.6వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ మొత్తాన్ని కేంద్రం పెంచుతుంది అంటూ వార్తలు వస్తున్న క్రమంలో దీనిపై స్పందించిన కేంద్రం సభాముఖంగా వివరణ ఇచ్చింది.

భారతదేశ వ్యాప్తంగా చిన్న,సన్నకారు రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ఈ నగదును వారి వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలి చేస్తోంది. దేశంలోని దాదాపు 10 కోట్లకుపైగా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు లబ్ది పొందుతాయి. 2018 నుండి ఈ సహాయం అందించబడుతున్న విషయంతెలిసిందే.