అమెజాన్ డ్రైవర్ల బిజినెస్ ట్రిక్.. చెట్లకు వేలాడుతున్న సెల్ ఫోన్లు

అసలే కరోనా తాకిడికి అతలాకుతలం అయిపోయిన జీవితాలు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్లీ జీవనపోరాటం మొదలెట్టేశాయి. చికాగో అమెజాన్ డెలివరీ స్టేషన్స్, హోల్ ఫుడ్స్ స్టోర్స్ వద్ద ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అదెలాగో తెలుసా.. చెట్లకు ఫోన్లను వేలాడదీసి దగ్గర్లోని పార్కింగ్ ఏరియాలో కూర్చుంటారు. ఇది కూడా కాంపిటీషన్ లో భాగమే.



అదెలా అంటే అమెజాన్ సిస్టమ్ దగ్గర్లోని డ్రైవర్లను ఎంపిక చేస్తుంది. అందుబాటులో ఉండే వ్యక్తులకే ఆర్డర్ వెళుతుంటుంది. స్టోర్లకు దగ్గర్లో ఫోన్లను వేలాడదీసి ఉంటున్నారు. డ్రైవర్ల మధ్య కాంపిటీషన్ ఇలా చేయేలా ప్రేరేపిస్తుంది. ఈ డ్రైవర్ల కో ఆర్డినేషన్ తో అమెజాన్ సిస్టమ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుందని బ్లూమ్‌బర్గ్ చెప్తుంది.
https://10tv.in/corona-effect-commodity-exchange/
ఎకానమీ తంటాల్లో కాంపిటీషన్ లెవల్ పెరిగిపోతుంది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో బిజినెస్ పెంచుకోవడం కోసమే ఈ తంటాలు. వీరి సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు. గంటకు 18డాలర్లు. యూబర్, లిఫ్ట్ లాంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు.. పని తక్కువే కాక. సంపాదించుకోవడానికి కూడా ఎక్కువ టైమే పడుతుంది. అందుకోసమే వారు అమెజాన్ ఆర్డర్లు దక్కించుకోవడానికి తాపత్రయపడుతుంటారు.



ఇలా చెట్లకు ఫోన్లు వేలాడదీసే ప్రక్రియకు దూరంగా ఉన్న డ్రైవర్లు మాత్రం ఆన్‌లైన్ చాట్ రూంలో తమకు ఆర్డర్లు రావడం లేదని లబోదిబోమంటున్నారు. దీని గురించి అమెజాన్ కు తెలిసినా ఏం చేయలేకపోతుందని ఒక డ్రైవర్ చెబుతున్నాడు. ఫాస్ట్ డెలివరీ చేయగలిగితే ఇన్‌స్టంట్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని అమెజాన్ అధికార ప్రతినిధి అంటున్నారు.