Corona Vaccine : ఆరు నెలల శిశువుకు అందుబాటులోకి కరోనా టీకా

ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు ఆమోదం లభించింది.

Vaccine

corona vaccine : ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఫైజర్‌, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు ఆమోదం లభించింది.

Corona Vaccination: పిల్లలకు కరోనా టీకాలు ప్రారంభం

అయితే పెద్దలకి ఇచ్చే ఫైజర్ టీకా డోసులో పదో వంతు పిల్లలకు ఇవ్వనున్నారు. మోడర్నా విషయంలో ఇది నాలుగో వంతుగా ఉంది. టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. చిన్న పిల్లలకు కరోనా టీకా కోసం ఎన్నో రోజుల నుంచి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయంతో ఆరు నెలల చిన్నారులను కరోనా నుంచి రక్షించడంలో వ్యాక్సినేషన్ తోడ్పడుతుంది.