సైంటిస్టులు ఆశ్చర్యపరిచే విధంగా.. ఏప్రిల్ 2019లో Black Hole గురించి అద్భుతమైన ఫలితం వచ్చింది. M87అనే తొలి బ్లాక్ హోల్ ను ఫొటో తీయగలిగారు. అది 55 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ (ఈహెచ్‌టీ) మేజర్ సైంటిఫిక్ చేసిన పనికి అంతా ఫుల్ హ్యాపీ అయ్యారు. పైగా వాళ్లు చేసిన పని పబ్లిక్ ఇంట్రస్ట్ ను వారి వైపుకు తిప్పుకుంది.
స్పేస్ లో ఉంటున్న బ్లాక్ హోల్స్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటున్నట్లు సైంటిస్టులు తెలుసుకోగలిగారు. ఈ పరిశీలన మరిన్ని చేయడానికి ప్రేరణగా మారింది. M87లో మార్పులు గమనించడానికి.. మకీక్ వీల్గస్ అధ్యక్షతన ఓ ఇంటర్నేషనల్ టీం రెడీ అయింది. హార్వార్డ్ యూనివర్సిటీలో బ్లాక్ హోల్ గురించి స్టడీ చేస్తున్న ఆయన 2009 నుంచి 2017వరకూ స్టడీ చేశారు.
‘అసాధారణమైన పరిస్థితుల్లో ఫండమెంటల్ ఫిజిక్స్ గురించి అర్థం చేసుకోవడానికి.. బ్లాక్ హోల్ సమీప ప్రాంతాల్లో వాతావరణం, బ్లాక్ హోల్స్ పరిసరాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలుసుకోవాలనుకున్నాం’ అని వీల్గస్ ఓ మెయిల్ లో వెల్లడించారు.
ఈ బ్లాక్ హోల్ ద్రవ్యరాశి దాదాపు 6.5 బిలియన్ సూర్యుల కాంతితో సమానం. దీని చుట్టూ ఉండే నక్షత్రాలు, గ్యాస్ లాంటి ఇతర పదార్థాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఈహెచ్ టీ ఇమేజ్ బ్లాక్ హోల్ బోర్డర్ ను రివీల్ చేసింది. దానినే ఈవెంట్ కేంద్రంగా పరిగణిస్తున్నారు. దేని కంటే అందులో నుంచి ఎటువంటి కాంతి, పదార్థం లాంటివి తిరిగి రావడం లేదు.
ఆరంజ్ రంగులో ఉండే డిస్క్ వంటి స్ట్రక్చర్ మెటేరియల్ బ్లాక్ హోల్ లో పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ప్రక్రియనే అక్రిషన్ అంటాం. ఇక ఈ మెటేరియల్ లో కింది భాగం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది భూమి వైపుగా తిరుగుతుంటుంది కాబట్టి. డాప్లర్ ఎఫెక్ట్ కారణంగా రేడియన్స్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది.
Scientists have obtained the first image of a black hole, using Event Horizon Telescope observations of the center of the galaxy M87. The image shows a bright ring formed as light bends in the intense gravity around a black hole that is 6.5 billion times more massive than the Sun pic.twitter.com/AymXilKhKe
— Event Horizon ‘Scope (@ehtelescope) April 10, 2019