suspicious object
US Blew Up Suspicious Object : గగన తలంలో అమెరికా గర్జిస్తోంది. అనుమానాస్పద వస్తువు కనిపిస్తేచాలు దాని అంతు చూస్తుంది. తాజాగా మరో అనుమానాస్పద వస్తువును అమెరికా మిలిటరీ కూల్చివేసింది. మిచిగాన్ ద్వీపకల్పం మీదుగా అమెరికా, కెనడా సరిహద్దులోని హురాన్ సరస్సుపై ప్రయాణిస్తున్న వస్తువును గుర్తించిన అమెరికా రక్షణ శాఖ వెంటనే దానిని నేల కూల్చింది.
అష్టభుజి ఆకారంలో ఉన్న ఆ వస్తువుకు నిఘా సామర్థ్యం, సైనిక ముప్పు కలిగించే శక్తి లేదని గుర్తించారు. కానీ ఎయిర్ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో కూల్చి వేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకే దాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. మరోవైపు ఇప్పటికే చైనా బెలూన్ తోపాటు అలస్కా తీరంలో అనుమానాస్పద వస్తువును కూడా అమెరికా పేల్చివేసింది.