World Purest Yellow Diamond : ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పసుపు రంగు వజ్రం .. వేలానికి సిద్ధం.. కళ్లు చెదిరిపోయే ధర

ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పసుపు రంగు వజ్రం ..కళ్లు చెదిరిపోయే ధర వేలానికి సిద్ధంగా ఉంది.

World Purest Yellow Diamond : వజ్రం..మట్టిలో ఉండే మాణిక్యం. ఎక్కడుతున్నా వజ్రానికి ఉన్న విలువ తగ్గదు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల వజ్రాలు ఆకట్టుకున్నాయి. పింక్ డైమండ్ నుంచి బ్లాక్ డైమండ్ వరకు తమ మెరుపులు మెరిపించాయి. వేలంలో తమదైన రాజసాన్ని చూపించాయి. కొనుగోలుదారుల్లో ఆకట్టుకుని దక్కించుకోవాలని కోరికను పెంచాయి. ధరల్లో కూడా తమ రేంజ్ ను ప్రదర్శించాయి. ఇప్పుడు వాటికి ఏమాత్రం తగ్గని అందంతో..ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలన్నంత అందంతో మరో అందాల ఖరీదైన వజ్రం వేలానికి సిద్ధమైంది. అదే ప్రపంచంలోనే ‘స్వచ్ఛమైన పసుపు రంగు వజ్రం’..! గోల్డెన్ కనరీ వజ్రంగా పిలవబడే ఈ వజ్రం బరువు 303.1 క్యారెట్లు బరువుంది..!!

Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”

గోల్డెన్ కనరీ వజ్రానికి ప్రపంచంలోనే అత్యంత స్వచ్చమైన డైమండ్‌గా పేరుంది. ప్రపంచంలోనే వజ్రాల మైనింగ్ చేపట్టే ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ 1980లో కాంగో దేశంలో తవ్విన గనికి సంబందించిన తవ్వకాలు జరిపిన మట్టిలో ఈ పసుపు రంగు వజ్రం బయటపడింది. గోల్డెన్ కనరీ వజ్రంగా పిలవబడే ఈ వజ్రం బరువు 303.1 క్యారెట్లు ఉంచారు. ప్రస్తుతం దీనిని దుబాయ్‌ లోని సోత్‌ బీ వేలం శాలలో ప్రదర్శనకు ఉంచారు.

వావ్..ఏమి అందం : పింక్ డైమండ్ ధర రూ. 198 కోట్లు..!!

2022 డిసెంబర్ 7 తేదీన న్యూయార్క్ లోని సోత్ బీ వేలం శాలలో వేలం వేయనున్నారు. ప్రపంచంలోకెల్లా నాలుగో అతిపెద్ద వజ్రం ఇదే కావడం విశేషం. బంగారు రంగులో కళ్లు చెదిరే మెరుపులు వెదజల్లుతున్నీ ప్రపంచంలోనే స్వచ్ఛమైన ఈ డైమండ్‌కు కనీస ధరగా 123 కోట్లుగా నిర్ధారించారు. వేలం పాటలో అంతకు మించే పలుకుతుందని అంచనా వేస్తున్నారు వేలం నిర్వహకులు.

NIZAM GOlD COIN : 12 కిలోల ‘నిజాం బంగారు నాణెం’ 40 ఏళ్ల మిస్టరీ వీడేనా?..ఆచూకీ లభించేనా..?

కాంగోలో మట్టి తవ్వకాల్లో బయటపడ్డ సమయంలో ఈ వజ్రం బరువు 890 క్యారెట్లు ఉంది. దాదాపు నలభై ఏళ్లుగా వజ్రాన్ని సానబట్టడం, చేతులు మారడం వల్ల అది కాస్తా బరువు తగ్గిపోయిందని వేలం వేస్తున్న నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతటి స్వచ్ఛమైన , ఖరీదైన వజ్రాన్ని ఏ సంపన్నుడు సొంతం చేసుకుంటాడో తెలియాలంటే డిసెంబర్‌ 7వ తేది వరకు వేచి చూడాల్సిందే.

NIZAM gold coin : ప్రపంచంలోనే అతిపెద్ద ‘నిజాం గోల్డ్ కాయిన్’ ఆచూకీ కోసం మోడీ సర్కార్ యత్నాలు

 

 

ట్రెండింగ్ వార్తలు