Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”

భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత అరుదైనదిగా చెప్పబడుతున్న ఈ "బ్లాక్ డైమండ్" విశ్వంలోని సుదూర ప్రాంతం నుంచి భూమికి చేరినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”

Diamond

Black Diamond: ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల వజ్రం వేలానికి వచ్చింది. ప్రముఖ వేలం నిర్వాహక కంపెనీ “సౌతేబై’స్” తమ దుబాయ్ కార్యాలయం వేదికగా ఈ నల్ల వజ్రాన్ని ఇటీవల మీడియా ప్రతినిధులకు పరిచయం చేసింది. “The Enigma” అంటూ ముద్దుగా పిలిచే ఈ బ్లాక్ డైమండ్ 555.55 క్యారెట్లు ఉన్నట్లు వేలం సంస్థ తెలిపింది. సంస్థకు చెందిన వివిధ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచిన అనంతరం ఈ ఏడాది ఈ నల్ల వజ్రాన్ని లండన్ లో వేలం వేయనున్నట్లు “సౌతేబై’స్” తెలిపింది. భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత అరుదైనదిగా చెప్పబడుతున్న ఈ “బ్లాక్ డైమండ్” విశ్వంలోని సుదూర ప్రాంతం నుంచి భూమికి చేరినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ వజ్రంపై నిర్వహించిన కార్బన్ పరీక్షల ఆధారంగా దీని పుట్టుపూర్వోత్తరాలు గుర్తించినట్లు సమాచారం.

Also read: Corona Update: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

ఫిబ్రవరిలో లండన్ వేదికగా ఈ వజ్రాన్ని వేలం వేయనుండగా.. $ 6.8 మిలియన్ల అమెరికన్ డాల్లర్లు వరకు ధర పలికే అవకాశం ఉన్నట్లు “సౌతేబై’స్” ప్రతినిధి తెలిపారు. సాధారణంగానే ఐదు ముఖాలు కలిగిన వజ్రాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని, ప్రస్తుతం ఈ బ్లాక్ డైమండ్ లో 55 కోణాలు గుర్తించినట్లు సోఫీ స్టీవెన్స్ అనే వజ్రాల స్పెషలిస్ట్ తెలిపారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో శుభంగా భావించే “ఖంసా” (అరచేతి ముద్ర) ఆకారంలో ఈ వజ్రం ఉందని “సౌతేబై’స్” సంస్థ తెలిపింది.

Also read: Asteroid:భూ కక్ష్యను దాటుకుంటూ వెళ్లనున్న భారీ గ్రహశకలం