Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న డేంజరస్ ‘గ్రహశకలం’

భూమిపైనున్న అత్యంత ఎత్తైన భవనం "బుర్జ్ ఖలీఫా" కంటే రెండు రేట్లు పెద్దదిగా ఉన్న ఆ ఆ గ్రహశకలం మంగళవారం నాడు భూమికి చేరువగా.. భూ కక్ష్యను దాటనుంది.

Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న డేంజరస్ ‘గ్రహశకలం’

Aster

Asteroid 1994 PC1: భారీ గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకువస్తుంది. భూమిపైనున్న అత్యంత ఎత్తైన భవనం “బుర్జ్ ఖలీఫా” కంటే రెండు రేట్లు పెద్దదిగా ఉన్న ఆ ఆ గ్రహశకలం మంగళవారం నాడు భూమికి చేరువగా.. భూ కక్ష్యను(క్షితిజ సమాంతరంగా) దాటనుంది. ఈమేరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ “నాసా” వివరాలు వెల్లడించింది. గ్రహశకలం 7482గా నామకరణం చేయబడిన ఈ గ్రహశకలాన్ని మొట్టమొదట మొదట ఆస్ట్రేలియాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. అప్పట్లో దీనిని 1994 PC1గా పిలిచేవారు.

Also read: Corona Treatment: కరోనా రోగుల చికిత్సకు మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దాదాపు ఒక కిలోమీటర్ వెడల్పు కలిగి ఉన్న ఈ గ్రహశకలం “ఎంతో ప్రమాదకరమైనది”గా నాసా పేర్కొంది. 140 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాలు పరిభ్రమిస్తుంటే..అవి భూమి కక్ష్యకు, సూర్యునికి 4.6 మిలియన్ మైళ్ల చేరువలోకి వచ్చినట్లైతే అటువంటి గ్రహశకలాలను ప్రమాదకరమైనవిగా నాసా గుర్తిస్తుంది. అటువంటి గ్రహశకలాలు భూమి కక్ష్యలో ప్రవేశిస్తే..పెనుమార్పులు చోటుచేసుకుంటాయని నాసా తెలిపింది. ప్రస్తుతం 1994 PC1 గ్రహశకలం భూమికి 1,230,000-మైళ్ళు చేరువుగా వచ్చి, భూమి యొక్క కక్ష్యను.. క్షితిజ సమాంతరంగా దాటనున్నట్లు నాసా తెలిపింది. దీని వలన భూమికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదని నాసా పేర్కొంది.

Also read” Hyderabad Crime: పాతబస్తీలో దారి కాచి యువకుడిపై కత్తులతో దాడి

ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. భారత కాలమానం ప్రకారం జనవరి 19న తెల్లవారుజామున 3.21 గంటల సమయంలో ఈ 1994 PC1 గ్రహశకలం భూమికి అత్యంత చేరువగా రానుంది. తిరిగి 200 ఏళ్ల తరువాత ఈ గ్రహశకలం భూమికి మరింత దగ్గరగా వెళ్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమికి చేరువగా వస్తున్న 1994 PC1 గ్రహశకలాన్ని సాధారణ టెలీస్కోప్ ద్వారా వీక్షించవచ్చని అంతరిక్ష పరిశోధకులు తెలిపారు.

Also read: RajiniKanth : ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. రజినీ ధైర్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పోస్టులు