worlds smallest car : డోర్లు, టైర్లు లేని ప్రపంచంలోనే అతి చిన్న కారు చూసారా?

టైర్లు, డోర్లు లేని కారుని చూసారా? అరే అది ఎలా రోడ్డుపై వెళ్తుంది అని ముందుగా మీకు డౌట్ వస్తుంది. ప్రపంచంలోనే అతి చిన్న కారు వీడియో వైరల్ అవుతోంది. దానికి టైర్లు, డోర్లు లేవు మరి.

worlds smallest car

worlds smallest car : ప్రపంచంలోనే అతి చిన్న కారును చూసారా? అదీ డోర్లు, టైర్లు లేని కారు.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. రోడ్డుపై పరుగులు తీస్తున్న సియాన్ కలర్ కారు వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

First Flying Car : ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు .. అమెరికా ప్రభుత్వం ఆమోదం

ఆటోమొబైల్ రంగం సరికొత్త సాంకేతికతతో ముందుకు వెళ్తోంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ డిజన్లు, ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇదే తరహాలో తయారు చేసిన  ‘ప్రపంచంలోనే అతి చిన్న కారు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ కారు అనేకమందిని ఆకర్షించింది.  Massimo అనే ట్విట్టర్ యూజర్ ఈ కారు వీడియోను షేర్ చేశారు. వీడియోలో సియాన్ కలర్ కారు రోడ్డుపై కదులుతుంది. దీనికి డోర్లు, టైర్లు లేవు. అయినా రోడ్డుపై సాఫీగా వెళ్తున్న ఈ కారును చూసి జనం ఆశ్చర్యపోయారు. విరిగిన కారులాగ కనిపిస్తున్న దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

Nagarjuna : ఎల‌క్ట్రిక్ కారు కొన్న నాగార్జున‌.. రేటు ఎంతో తెలుసా..?

‘ఇలాంటి కారువల్ల ఉపయోగం ఏంటి?’ అని ఒకరు.. ‘ప్రయాణికులను తీసుకెళ్లలేని దీనిని కారు అంటారా?’ అని మరొకరు కామెంట్లు చేశారు. చూడటానికి కాస్త వింతగా కనిపిస్తున్నా దీనివల్ల ఏం ఉపయోగం లేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.