Young Woman : నడి రోడ్డుపై అమ్మాయి ఏం చేసిందో తెలుసా..వీడియో వైరల్
నడి రోడ్డుపై ఓ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
- madhu
- Published On : April 9, 2021 / 12:54 PM IST
young woman
Saved The Turtle : నడి రోడ్డుపై ఓ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె స్పందించిన తీరుకు నెటిజన్లు స్పందిస్తున్నారు. అసలు ఆ యువతి ఏం చేసింది ? అనేగా మీ డౌట్. కొంతమంది మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. మనుషులు, జంతువులు కష్టాల్లో ఉన్నా..స్పందించకుండా..మనకెంటిలే అనుకుంటూ..తమ పని చేసుకపోతుంటారు. మనతో పాటు జీవించే ఓ చిన్ని ప్రాణాన్ని కాపాడిందా ఆ యువతి.
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ..రోడ్డుపై తాబేలు చిక్కుకుంది. వాహనాలు రయ్ రయ్ అంటూ వెళుతండడంతో రోడ్డుపై అలాగే ఉండిపోయింది. ఈ సమయంలో అక్కడి నుంచి వెళుతున్న యువతికి ఈ దృశ్యం కనిపించింది. ఎక్కడ చచ్చిపోతుందోనన్న భయం ఆమెలో కనిపించింది. వెంటనే అటూ..ఇటూ చూసుకుంటూ..దాని దగ్గరకు వెళ్లింది. రెండు వస్త్రాల సహాయంతో..తాబేలును మెళ్లిగా..పట్టుకుని.. రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లి వదిలేసింది. అథ్లెట్ లా చక్కటి ఫిట్ నెస్ తో ఆమె కనిపిస్తోంది.ఎప్పుడు, ఎక్కడ జరిగిందో కానీ..దీనిని కొందరు వీడియోను తీసి..సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
Read More : Parabolic Solar Dryer : ఇక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎంచక్కా ఎండబెట్టుకుని తినొచ్చు.. సోలార్ డ్రయ్యర్ వచ్చేసింది..
— not all heroes wear capes (@heroesbeingbro) April 8, 2021
