E-3 Sentry : ఇరాన్ కూల్చిన అమెరికా ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ’ ప్రత్యేకతలు ఇవే..
Boeing E-3 Sentry : ఈ-3 సెంట్రీ విమానం అమెరికా వైమానిక కార్యకలాపాలకు వెన్నెముకగా పరిగణిస్తారు. బోయింగ్ విమానం గాలిలో ఉంటూనే శత్రుదేశాల వైమానిక ముప్పును ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది.
- Harishth Thanniru
- Published On : March 30, 2026 / 12:20 PM IST
Boeing E-3 Sentry
- పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ
- బోయింగ్ ఈ-3 సెంట్రీని కూల్చేసిన ఇరాన్
- బోయింగ్ ఈ-3 సెంట్రీ ప్రత్యేకతలు ఎన్నో..
E-3 Sentry : పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా విమానం ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ’ తీవ్రంగా ధ్వంసమైంది. ఈ-3 సెంట్రీ విమానం అమెరికా వైమానిక కార్యకలాపాలకు వెన్నెముకంగా పరిగణిస్తారు.
ఈ బోయింగ్ విమానం గాలిలో ఉంటూనే శత్రుదేశాల వైమానిక ముప్పును ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ఇది నిఘా, పర్యవేక్షణ, కమాండ్ బాధ్యతలను ఏకకాలంలో నెరవేర్చగలదు. నావిగేషన్, కమ్యూనికేషన్, కంప్యూటేషన్ సేవలూ అందించగలదు. ఈ విమానం గాల్లో ఏకధాటిగా 9,300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 1970ల నుండి సేవలో ఉన్న ఈ విమానం, ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్, కాసావో యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ ఆపరేషన్లతో సహా ఆపరేషన్ ఇన్హెరెంట్ రిసాల్వ్ వంటి అనేక ప్రధాన సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది.
బోయింగ్ తమ 707-320బీ విమానాన్ని ఆధునీకరించి ఈ-3 సెంట్రీ విమానంగా రూపొందించింది. ఈ విమానంలో 250 మైళ్లకుపైగా పరిధిలో గగనతలాన్ని పర్యవేక్షిస్తుంది. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణుల జాడను పసిగట్టి సెకన్లలో సమాచారం చేరవేస్తుంది. భూ, గగనతల యుద్ధక్షేత్రంలో తాజా పరిస్థితులపై ఇదిచ్చే సమాచారంతోనే సైన్యానికి ఓ స్పష్టత వస్తుంది. భూ, సముద్ర గగణతలాలతోపాటు స్ట్రాటో ఆవరణం నుంచి దూసుకొచ్చే క్షిపణులను కూడా పసిగట్టి వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. విమానంలోని 14 కంప్యూటర్ తెరలపై తాజా సమాచారాన్ని గ్రాఫిక్‌ల రూపంలో చూసేందుకు వీలుంటుంది.
ఈ విమానం 46 మీటర్ల పొడవు ఉంటుంది. గంటలకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. భారీ నిఘా సాప్ట్ వేర్, హార్డవేర్లు అమర్చిన ఈ విమానం బరువు 1.57 లక్షల కిలోలు. ఇది గరిష్ఠంగా 29వేల అడుగుల ఎత్తుకు ఎగిరే సామర్థ్యం కలిగి ఉంది.
Newly released images capture the damage caused to an American E-3 AWACS plane in Iranian retaliatory strikes on Prince Sultan Air Base in Saudi Arabia.
Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/ftFLmC5wuB
— Press TV 🔻 (@PressTV) March 29, 2026
