Kansas House : ఉచితంగా ట్రిపుల్ బెడ్ రూం.. ఇలా చేస్తేనే

ఆ ఇంటిని కూల్చేయడానికి ఆ ఫౌండేషన్ ఇష్టపడడం లేదు. ట్రిపుల్ బెడ్ రూం ఇంటిని అమాంతం తీసుకెళ్లి మరోచోట అమర్చుకొనే వీలుంది. దీంతో ఓ కండీషన్ పెట్టి..

Home

This 3-Bedroom Home Is On Sale For Rs 0 : ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసు చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండింటిలో అంచనాకు మించిన ఖర్చులుంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇళ్లు కట్టాలంటే బాగానే ఖర్చు అవుతుంటుంది. అయితే.. ఇల్లు ఫ్రీగా వస్తుందంటే.. ఎగిరి గంతేస్తారు కదా. అది కూడా సింగిల్, డబుల్ ఇల్లు కాదు.. ట్రిపుల్ బెడ్ రూం. ఎక్కడ అని ఆరా తీస్తుంటారు. కానీ మీరు వింటున్నది నిజమే. రూపాయి కూడా ఎవరికీ ఇవ్వనక్కర్లేకుండానే ఆ ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అయితే.. ఓ కండీషన్ మాత్రం ఉందండి. ఆ కండీషన్ ఒకే అంటేనే ఇంటిని ఫ్రీగా ఇచ్చేస్తారు. అసలా విషయం ఏంటీ అని అనుకుంటున్నారా ?

Read More : Russia Attack On Theatre : థియేటర్‌పై రష్యా బాంబు దాడి.. 300మంది మృతి..!

అమెరికాలోని కన్సాస్ లోగల లింకన్ లో అత్యంత పురాతమైన ఇల్లు ఉంది. దీనిని 1910లో నిర్మించారు. మొత్తం 2 వేల 023 స్కేర్ ఫీట్ల మేర ఈ ఇల్లు విస్తరించి ఉంది. ఓక్, ఫన్ కట్టతో నిర్మించారు. ఈ ఇంటి విశేషం ఏమిటంటే.. కింద రాతి పునాది ఉంది. దీనిని మరోచోట ఏర్పాటు చేసుకొనే వీలుంది. చూడటానికి అబ్బా.. ఏముంది అని అనుకొనే విధంగా ఇంటిని నిర్మించారు. ఇంద్ర భవనంలా ఉన్న ఈ ఇంటి ప్రాంతంలో ఓ హాస్పిటల్ కట్టాలని లింకన్ కౌంటీ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ఫౌండేషన్ భావించింది.

Read More : Teenage Mastermind : మైక్రోసాఫ్ట్, శాంసంగ్ సీక్రెట్స్ హ్యాక్ చేసిన 16ఏళ్ల టీనేజర్.. మాస్టర్ మైండ్ ఇతడే..!

అయితే.. ఆ ఇంటిని కూల్చేయడానికి ఆ ఫౌండేషన్ ఇష్టపడడం లేదు. ట్రిపుల్ బెడ్ రూం ఇంటిని అమాంతం తీసుకెళ్లి మరోచోట అమర్చుకొనే వీలుంది. దీంతో ఓ కండీషన్ పెట్టి.. ఇంటిని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యాడ్ కూడా రూపొందించింది. ట్రాన్స్ పోర్టు ఖర్చుల కింద 30 వేల డాలర్లు (రూ. 22.87 లక్షలు) ఇస్తామని ఫౌండేషన్ ప్రకటించింది. ఈ సంవత్సరం వరకు వేచి చూస్తామని.. అప్పటి వరకు ఎవరూ రాకపోతే ఇంటిని కూల్చివేస్తామని వెల్లడించింది.