చిన్నప్పుడు అందరం చేసే పనుల్లో ఇదొకటి. ఏదైనా భయంకరమైన స్టోరీ వినాలని కుతూహలంతో ఓ సర్కిల్ లా కూర్చొని లేదా గుంపుగా క్రైం స్టోరీలు వినేవాళ్లం. వాటిల్లో మిస్టరీలను బట్టి కథకు వాల్యూ ఉంటుంది. ఒకటికి పదిసార్లు వినే కథలు ఉంటాయి. మధ్యలోనే ఆగిపోయేవి ఉంటాయి. ఇలా వినేటప్పుడు మనకు కొన్ని లైన్లు, క్యారెక్టర్లు అలా గుర్తుండిపోతాయి. ఈ సమయంలో మన అడ్రినలైన్ గ్రంథుల్లో తర్వాత ఫీలింగ్ ను రానివ్వకుండా నిండిపోయి ఉంటాయి.
ఇప్పటి రోజుల్లో చలిమంటలు వేసుకునే పిల్లలను మనం చూసి ఉండం. వారంతా టెక్నాలజీ మత్తులో పడి ఆన్ లైన్ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటానికి అలవాటుపడ్డారు. నిజానికి వీరంతా కొత్తగా ఏం ఆలోచించడం లేదు. ఒకప్పుడు చెప్పుకున్న పిట్టకథల స్థానాన్ని ఇవి భర్తీ చేశాయంతే. డాక్యుమెంటరీ సిరీస్‌లు మిచిగాన్ మర్డర్స్, ద కీపర్స్ లు ఓటీటీ ప్లాట్ ఫాంలపై బీభత్సమైన పాపులారిటీ సంపాదించాయి.
క్రైమ్ సైకాలజీ ఎక్స్‌పర్ట్ అమాండ వికారీ.. మహిళల్లో 16శాతం మంది ట్రూ క్రైమ్ మీద ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. మరో స్టడీలో క్రైం పట్ల మహిళల్లో ఆసక్తి పెరిగిపోయింది. వైన్ అండ్ క్రైమ్ అనే క్రైం షోకు 85శాతం మంది అభిమానులు మహిళలే అంటున్నారు నిర్మాణ యూనిట్.
ట్రూ క్రైం కంటెంట్ చూడడం వల్ల మహిళలు క్రిమినల్స్ మైండ్ సెట్ సులువుగా తెలుసుకోగలరు. బుక్స్ రూపంలో, సినిమాలు, షోలలో క్రైం గురించి తెలుసుకుంటుంటారు. దాడి చేయడానికి కారణాలేంటి. బాధితురాలు ట్రాప్ లో ఎలా పడింది. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి టెక్నిక్స్ వాడింది. ఈ కంటెంట్ చూస్తున్నప్పుడే అనుకోకుండా మహిళలు సమాచారాన్ని మొత్తం గ్రహించేస్తారట. ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీటిని కాపీ చేసేసుకుంటారట. హింసాపూరితమైన ఘటనలు జరిగే ముందే ఈ సంగతులు గుర్తు చేసుకుని బయటపడతారట.
నిజానికి క్రైం సీన్లలో మహిళలే నిందితులు లేదా బాధితులు. అది కూడా కాదంటే క్రైం జరగడానికి ప్రోత్సాహకంగా ఉంటారు. మహిళలు సమాజంలో అజాగ్రత్తగా ఫీల్ అవడంతో పాటు భయపడుతూ ఉంటారు. ఒకే మెంటాలిటీతో ఉండిపోతారు. సేఫ్ గా ఉండటానికి బలమైన కోరికను లీగల్ సిస్టమ్ కు అనుగుణంగా మార్చుకుంటారు.
ఇలా మహిళలు క్రైం సీన్లు చూడటానికి, చదవడానికి, వినడానికి నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఆ ఆతురతను తీర్చుకోవడానికి క్రైం సీన్లు చూస్తుంటారు. మీలోనూ క్రైం సీన్లు, క్రైం స్టోరీలు చదవాలని చూడాలనే ఇంట్రస్ట్ ఉన్నవారు ఈ కింద క్రైం కంటెంట్లపై ఓ లుక్కేయండి.
Podcast: Serial Killers, available on Spotify
Documentary series: The Keepers, available on Netflix
Book: In Cold Blood by Truman Capote