×
Ad

TikTok Star Girlalala: టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..! షాక్‌లో అభిమానులు.. పోలీసుల అదుపులో బాయ్‌ఫ్రెండ్..

సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో ఆమెకు..

TikTok Star Girlalala: టిక్ టాకర్ గిర్లాలాలా దారుణ హత్యకు గురైంది. గిర్లాలాలా అసలు పేరు మారిస్ జాడెన్ హారిసన్. ఫ్లోరిడాలోని తన అపార్ట్‌మెంట్ లో ఆమెను కాల్చి చంపారు. కాల్పులు జరిగిన వెంటనే ఆమె ప్రియుడు షానాయిడ్ వైట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టిక్ టాకర్ గిర్లాలాలా హత్య అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె వయసు 21 సంవత్సరాలు. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో ఆమెకు 2,63,300 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు 37.8K, 41.8K ఫాలోవర్లు ఉన్నారు. ఆమె యూట్యూబ్ ఛానెల్ (@LifeWgirlalala) కు దాదాపు 4వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఆమె మరణం తర్వాత, ప్రియుడు షానాయిడ్ వైట్ (25) పై ఫ్లోరిడాలో కేసు నమోదైంది. ప్రీ ప్లాన్డ్ గా హత్యకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి.

మరణానికి ముందు గిర్లాలాలా గృహ హింస గురించి ఆన్‌లైన్‌లో చాలాసార్లు మాట్లాడింది. చాలా మంది వీక్షకులు ఆమె వీడియోలను చూసి ఆమె గురించి ఆందోళన చెందారు. కాగా.. గతంలో ఆమె ఓ కేసులో అరెస్ట్ అయ్యింది. దొంగతనం, సస్పెండెడ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె అపార్ట్‌మెంట్ లోపల గొడవ జరిగింది. ఆ తర్వాత కాల్పులు జరిగాయి. ప్రియుడు షానాయిద్ వైట్ ఆమెను కాల్చి చంపాడని, అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Also Read: మరణ శిక్షపై స్పందించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. ఏమన్నారంటే…?