Indian Silver Medalist Mirabai Could Be Awarded Gold Medal
indian silver medalist mirabai could be awarded gold medal : టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తెచ్చినందుకు మణిపూర్ మణిపూస్ మీరాభాయి ఛానుకు ప్రశంసలు వెల్లువుతున్నాయి. ఈక్రమంలో ఆమె సిల్వర్ మెడల్ గోల్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్న చైనా క్రీడాకారిణి హుజిహుయికి డోపింగ్ టెస్టులు చేయనున్నారు. టెస్టుల్లో నిర్ధారణ అయితే ఆమెకు దక్కిన పసిడి పతకం మన ఛానుకు దక్కనుంది. కాగా..49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో చాను సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయి బంగారు పతకం గెలుచుకోగా మన ఛాను సిల్వర్ తో సరిపెట్టుకుంది. ఈక్రమంలో రెండు రోజుల తరువాత చైనా క్రీడాకారిణికి ఒలింపిక్స్ నిర్వాహకులు డోపింగ్ టెస్టులు చేయనున్నారు. ఈ టెస్టుల్లో ఆమె విఫలమైతే ఛాను సిల్వర్ మెడల్ కు బదులు గోల్డ్ మెడల్ అవ్వనుంది. చైనా అథ్లెట్ హుజిహుయి డోపింగ్ నిర్ధారణ అయితే ఆమెకు దక్కిన పసిడి పతకం మన ఛానుకు దక్కనుంది. ఈక్రమంలో పోటీలు పూర్తి అయినా..పతకాలు అందజేసినాగా గానీ క్రీడాకారులను అక్కడే ఉంచేశారు. అధికారులు. సిల్వర్ మెడల్ పట్టుకుని చాను కోసం భారత్ వేయి కళ్లతో ఎదురు చూస్తుండగా సిల్వర్ కు బదులుగా స్వర్ణ పతకంతో భారత్ లో మీరాభాయి ఛాను అడుగిటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈక్రమంలో హుజిహుయిని ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా క్రీడల నిర్వహకులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆమెకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యాంటీ డోపింగ్ అధికారులు వెల్లడించారు. ఒకవేళ జిహుయి డోప్ పరీక్షలో విఫలమైతే.. రెండో స్థానంలో ఉన్న మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్ దక్కుతుంది.కాగా, ఈ ఈవెంట్‌లో జిహుయి.. స్నాచ్‌లో 94 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 116 కిలోలు(మొత్తంగా 210 కిలోలు) ఎత్తి బంగారు పతకం కైవసం చేసుకోగా, చాను.. స్నాచ్‌లో 87 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోల(మొత్తంగా 202 కిలోలు) బరువు ఎత్తి రజతంతో సరిపెట్టుకుంది. ఇక ఇండోనేషియా వెయిట్‌లిఫ్టర్ విండీ కాంటికా మొత్తంగా 194 కిలోల బరువు ఎత్తి కాంస్యం తృప్తి చెందింది. ఇదిలా ఉంటే, మీరాబాయి ఇప్పటికే భారత్‌కు తిరుగు ప్రయాణమైంది.
సోమవారం ఉదయం స్వదేశానికి ఫ్లైటెక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కోచ్‌తో దిగిన ఫొటోను ఆమె ట్విటర్‌లో షేర్ చేసింది.మరి చైనా క్రీడాకారిణి డోపింగ్ టెస్టులో పరీక్షలో విఫలమైతే..సిల్వర్ కు బదులుగా మన మీరాభాయి ఛాను గోల్డ్ మెడల్ తో భారత్ లో అడుగు పెడుతుంది. అదే గనుక జరిగిదే ఇప్పటి వరకూ తొలి మెడల్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర క్రియేట్ చేసిన ఛానూ గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచిపోనుంది.