×
Ad

2026లో విదేశీ టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారా? పాత పర్యాటక ప్రదేశాలు చూసి బోర్‌ కొట్టిందా? అయితే వీటిని చూడండి..

సరస్సులు, అడవులతో నిండిన పర్వత లోయలు ఉన్న ప్రాంతాలకు వెళ్తే మీలోని ఒత్తిడి మొత్తం పోతుంది.

Saadiyat Cultural District

Travel 2026: కొత్త ఏడాది మరికొన్ని రోజుల్లో రానుంది. ఎన్నడూ చూడని కొత్త పర్యాటక ప్రదేశాలను 2026లో చూసి, మీ ఒత్తిడిని పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ప్రపంచంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, ఈ పర్యాటక ప్రదేశాలకు వెళ్లండి..

అబుదాబిలో
సాదియాత్ కల్చరల్ డిస్ట్రిక్ట్: అబుదాబిలో ఉన్న సాదియాత్ దీవిపై మ్యూజియాలు, కళా కేంద్రాలు, సాంస్కృతిక సంస్థలను ఒకేచోట చూడొచ్చు. 2026లో అబుదాబికి వెళ్తే సాదియాత్ దీవిపై ఉన్న సాదియాత్ కల్చరల్ డిస్ట్రిక్ట్‌లో జాయెద్ నేషనల్ మ్యూజియం, టీమ్‌ల్యాబ్ ఫినామెనా చూడొచ్చు. జాయెద్ నేషనల్ మ్యూజియం ఇంకా నిర్మాణ దశలో ఉంది. 2026లో ప్రారంభం కావచ్చు. టీమ్‌ల్యాబ్ ఫినామెనా మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది.

అల్జీరియాలో
ఇప్పటివరకు విదేశీ పర్యాటకులు రావడానికి అంతగా అనుమతులు ఇవ్వని అల్జీరియా ఇప్పుడు మాత్రం నిబంధనలు సడలించి ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులను స్వాగతించడం మొదలుపెట్టింది. ముందుగా వీసా తీసుకోకుండా, గుర్తింపు పొందిన టూర్ గ్రూప్‌తో వెళ్లిన పర్యాటకులకు విమానాశ్రయంలోనే వీసాలు ఇస్తోంది. టిమ్గాడ్, జెమిలాలో ఉన్న రోమన్ కాలం నాటి పురాతన కట్టడాలను చూడొచ్చు. సహారా ఎడారి దృశ్యాలను డ్జానెట్ ఓయాసిస్ కేంద్రంలో చూడొచ్చు. సాంస్కృతిక వారసత్వం, హస్తకళాకారుల సంరక్షణపై అల్జీరియా దృష్టి సారించింది. వాటిని చూడొచ్చు.

కోల్చాగ్వా లోయ, చిలీలో
చిలీ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వైన్ ఉత్పత్తుల్లో ముఖ్యమైన దేశంగా గుర్తింపు పొందింది. చారిత్రక ఎస్టేట్లు, విలాసవంతమైన ద్రాక్షతోట నివాసాలు ఉంటాయి. కౌబాయ్ జీవనం, రోడియోలు, గ్రామీణ పల్లెలు ప్రత్యేకతలు ఆకర్షిస్తాయి.

కుక్ దీవుల్లో
చాలా పెద్ద పోలినీషియన్ దీవుల సమూహంలో ఇది ఉంది. అక్కడ పర్యాటకుల రద్దీ తక్కువ. రారోటోంగా పర్వతాలు, వర్షారణ్యాలు, లాగూన్లను చూడొచ్చు. సముద్ర, భూసంరక్షణ చర్యలను అక్కడి ప్రభుత్వం బలోపేతం చేసింది. కొత్త అంతర్జాతీయ విమాన మార్గాలతో కుక్‌ దీవులకు వెళ్లడం మరింత సులభతరం అయింది. సముదాయ ఆధారిత పర్యాటకంతో బలమైన సాంస్కృతిక గుర్తింపు

కోస్టారికాలో
జీవవైవిధ్యం, సంరక్షణ విధానాల్లో కోస్టారికా పేరు పొందింది. సుమారు 60% అరణ్య కవర్, 25% రక్షిత భూభాగం ఉంటుంది. ఓసా ద్వీపకల్పంలో అడవులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 2026లో జాగ్వార్, షార్క్ రక్షణ విస్తరణ ప్రణాళిక ఉంది. ఓసా ద్వీపకల్పం కోస్టారికా దక్షిణంలో ఉన్న అత్యధిక జీవవైవిధ్య ప్రాంతం.

హెబ్రిడ్స్, స్కాట్లాండ్‌లో
ఈ అట్లాంటిక్ దీవులు పురాతన సాంస్కృతిక వారసత్వం, తెల్ల ఇసుక తీరాలు, ప్రపంచ ప్రసిద్ధ విస్కీ కారణంగా పేరుగాంచాయి. కాలనైస్ స్టాండింగ్ స్టోన్స్ వద్ద కొత్త టూరిస్ట్‌ కేంద్రం ఉంది.

ఇషికావా, జపాన్‌లో
నోటో ద్వీపకల్ప భూకంపం (2024) విధ్వంసం సృష్టించిన తర్వాత దీన్ని పునర్నిర్మించారు. కనజావా సంప్రదాయ హస్తకళలు, తోటల సంరక్షణ వంటివాటితో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు. సముద్రాహారం, వాజిమా లాకర్ కళ, ప్రీమియం సాకేకు మంచి పేరు ఉంది. సాకే అంటే జపాన్ సంప్రదాయ బియ్యం మద్యం.

కోమోడో దీవులు, ఇండొనేషియాలో
యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందిన ఈ జాతీయ ఉద్యానవనం, కోమోడో డ్రాగన్ల సహజ నివాసంగా ప్రసిద్ధి. కోమోడో డ్రాగన్ ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి (లార్జెస్ట్ లిజార్డ్) జాతి. అవి ఇంకా జీవిస్తున్నాయి. ఇండొనేషియాలోని కోమోడో, రింకా, ఫ్లోరస్ దీవుల సమీప అరణ్యాలలో స్వతంత్రంగా ఉంటాయి. ఇండొనేషియాలో ప్రపంచస్థాయి సముద్ర జీవవైవిధ్యాన్ని పోషించే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. పర్యావరణ పర్యాటకమే స్థానికులకు ఆదాయ మార్గం.

లోరేటో, మెక్సికో
గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా ప్రాంతంలో ప్రకృతి, సముద్ర జీవులను విజయవంతంగా రక్షించిన ప్రాంతంగా లోరెటో నిలుస్తోంది.
తిమింగలాలు, తాబేళ్లు, సముద్ర సింహాలను చూడొచ్చు.

మాంటెనెగ్రో
బే ఆఫ్ కోటోర్ అడ్రియాటిక్ తీరం మధ్యలో ఉంటుంది. అక్కడి పర్వతాల్లో అరుదైన యూరోపియన్ అడవి ఉంటుంది. పీక్స్ ఆఫ్ ది బాల్కన్స్ ట్రయిల్ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తుంది.

ఒరెగాన్ తీరం, యునైటెడ్ స్టేట్స్
చాలా పొడవైన తీరం అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండడం దీని ప్రత్యేకత. అక్కడ కొండచరియలు, అడవులు, తీరం దృశ్యాలు కలిపి అద్భుతంగా కనిపిస్తాయి. కొత్త రవాణా సౌకర్యాలు, ఈవీ మౌలిక వసతులు ఉంటాయి.

స్లోకాన్ లోయ, కెనడా
సరస్సులు, అడవులతో నిండిన పర్వత లోయ ఇది. 2026లో జపనీస్ కెనడియన్ లెగసీ ట్రయిల్ ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధ నిర్బంధ చరిత్రను గుర్తు చేస్తుంది. మ్యూజియాలు, కేఫేలతో స్థానికులకు ఆర్థికంగా బాగా ఉపయోగపడుతోంది.