Donald Trump Hormuz Transit Charge : హార్మూజ్‌లో ట్రంప్‌కి ఇండియా కూడా ట్యాక్స్ కట్టాలా? అదేమన్నా రూలా?
Donald Trump Hormuz Transit Charge : హార్మూజ్ జలసంధిలో రక్షణ కల్పిస్తున్నందుకు నౌకలు ట్యాక్స్ కట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హుకుం జారీ చేశారు. అదేమన్నా రూల్ ఉందా? అంటే.. అలాంటిదేం లేదు.
- Harish Thanniru
- Published on- July 14, 2026 / 12:11 PM IST
trump hormuz tax india oil imports impact
Donald Trump Hormuz Transit Charge : హార్మూజ్ జలసంధిలో రక్షణ కల్పిస్తున్నందుకు నౌకలు ట్యాక్స్ కట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హుకుం జారీ చేశారు. నౌకలో ఉన్న వస్తువు విలువలో 20శాతం పన్ను కట్టాలని ఆర్డర్స్ వేశారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ నుంచి తాము రక్షణ కల్పిస్తున్నందుకు ఈ పన్ను కట్టాల్సిందేనంటూ వాదిస్తున్నారు. అయితే, ఇండియా కూడా ట్రంప్ చెప్పినట్టు అమెరికాకి 20శాతం ట్యాక్స్ కట్టాలా? అదేమన్నా రూల్ ఉందా? అంటే.. అలాంటిదేం లేదు.
Also Read : Donald Trump : మళ్లీ ట్రంప్ దెబ్బ.. బీభత్సంగా పెరగనున్న పెట్రోల్ ధరలు..
ఐక్యరాజ్యసమితి మారిటైమ్ బోర్డు నిబంధనల ప్రకారం హార్మూజ్ జలసంధి అనేది ఫ్రీ ట్రావెల్. ఆ మార్గం నుంచి వెళ్లే వాణిజ్య నౌకలు ఎవరికీ ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. అది ఇరాన్ అయినా సరే, లేకపోతే అమెరికా అయినా సరే. ఎవరికీ సుంకాలు చెల్లించాల్సిన పనిలేదు.
ట్రంప్ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ఏంటి?
రూల్స్ ప్రకారం అమెరికాకు మనం ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే మాత్రం ఇండియా నెత్తిన పిడుగు పడడం ఖాయం. ఎందుకంటే, ఇండియా దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌లో మొత్తం 40 శాతం ఈ మార్గం నుంచే ఇంపోర్ట్ అవుతోంది. అలాగే, 60శాతం LPG కూడా ఈ రూట్ నుంచే వస్తుంది. ఏకంగా 90శాతం LNG కూడా ఈ హార్మూజ్ నుంచే రవాణా అయి ఇండియాకి వస్తుంది. ఈ లెక్కన పెద్ద ఎత్తున ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది.
ఎన్ని కోట్లు కట్టాలి?
క్రూడాయిల్ ని బ్యారెల్స్ రూపంలో కొంటారు. ఒక బ్యారెల్ ధర ప్రస్తుతం 80 డాలర్లు. ఒక పెద్ద క్రూడాయిల్ నౌకలో సుమారు 20 లక్షల బ్యారెళ్ల ఆయిల్ పడుతుంది. అంటే, ఒక భారీనౌకలో తీసుకొచ్చే క్రూడాయిల్ ధర సుమారు 160 మిలియన్ డాలర్లు. అందులో 20శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తే సుమారు 32 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చూస్తే సుమారు 300 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టాలన్నమాట.
ఇండియాలో రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లడమే..
ఒకవేళ అమెరికాకు హార్మూజ్ ట్యాక్స్ కడితే అప్పుడు ఇండియాలో రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లడం ఖాయం. ఆల్రెడీ ఉన్న ధరలకు తోడు మరో 300కోట్ల రూపాయలు ట్రంప్‌కి ట్యాక్స్ రూపంలో చెల్లిస్తే ఆ భారం ఆయిల్ కంపెనీల మీద పడుతుంది. ఆయిల్ కంపెనీలు ఆటోమేటిక్‌గా వాటిని ప్రజల మీద రుద్దుతాయి. కాబట్టి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడానికి ఆస్కారం ఉంది. డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా ఆ ప్రభావం రవాణాపై పడుతుంది. నిత్యావసరాలు, కూరగాయలు, ఇతరత్రా వస్తువుల ధరలు పెరుగుతాయి.
ఇరాన్ ఎంత వసూలు చేస్తుంది?
వాస్తవానికి హార్మూజ్ మార్గంలో ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. కానీ, ఇటీవల తలెత్తిన పరిస్థితుల్లో ఇరాన్ ఒక నౌకకు సుమారు 2మిలియన్ డాలర్లు చొప్పున ట్యాక్స్ వసూలు చేస్తోంది. అంటే, మన కరెన్సీలో సుమారు 20 కోట్లు. అది కూడా ఐరాస మారిటైమ్ బోర్డు అనుమతి లేకుండానే. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏకంగా 20 మిలియన్ డార్లు కట్టాలంటే మాత్రం మనకు ఇబ్బందే.
