Japan earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. వీడియోలు వైరల్

సెంట్రల్ జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5గా భూకంప తీవ్రత నమోదైంది. అధికారులు జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Japan Earthquake

Japan earthquake Tsunami Warnings: సెంట్రల్ జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5గా భూకంప తీవ్రత నమోదైంది. అధికారులు జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇషీకావ, నిగాట, టోయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో ఐదు మీటర్ల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని, తీరప్రాంత ప్రజలు తక్షణం ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను జపాన్ ప్రభుత్వం పటిష్టం చేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. అయితే, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు తెలిపారు.

Also Read : కొడుకు రాజారెడ్డి పెండ్లి తేదీని వెల్లడించిన వైఎస్ షర్మిల.. వధువు ఎవరంటే?

భూకంపం ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. భూ ప్రకంపనలతో బిల్డింగులు ఊగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై చీలికలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందు జాగ్రత్తగా బుల్లెట్ రైళ్లను జపాన్ ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు జపాన్ లోని భారతీయుల సహాయార్థం కోసం ఇండియా ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది.