దేశాధ్యక్షుడికి ఇష్టమైన కుక్క కోసం..నేషనల్ హాలిడే ప్రకటించిన వైనం..రోజంతా వేడుకలే..

Turkmenistan president Alabai dog breed national holiday : బంగారంతో కుక్క బొమ్మ తయారు చేయించి దేశ రాజధాని నడిబొడ్డున ప్రతిష్టించిన తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు గర్భాంగులీ బెర్డ్‌ముఖమ్మెదొవ్‌‌ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గర్భాంగులీ బెర్డ్‌ముఖమ్మెదొవ్‌‌కు అలబాయ్ జాతి కుక్కలంటే చాలా ఇష్టం. దీంతో ఆయన అలబాయ్ జాతి కుక్కకు దేశ రాజధాని యష్గబత్‌ నడిబొడ్డున
ఏకంగా 19 అడుగుల ఎత్తైన విగ్రహం బంగారంతో తయారు చేయించి ఏర్పాటు చేశారు. ఈ దేశాధ్యక్షుడు తాజాగా మరొక ప్రకటించారు.

కనకంతో కుక్కకు 19 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయటమే కాక ఆ కుక్క కోసం నేషనల్ హాలీడే కూడా ప్రకటించారు దేశాధ్యక్షుడు గర్భాంగులీ బెర్డ్‌ముఖమ్మెదొవ్‌‌. ఏదైనా పండుగ లేదా మహనీయులు జయంతి లేదా వర్ధంతి లేదా జయంతులను పురస్కరించుకుని నేషనల్ హాలీడేస్ ప్రకటిస్తారనే విషయం తెలిసిందే. కానీ తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు గర్భాంగులీ బెర్డ్‌ముఖమ్మెదొవ్‌ ట్రెండే వేరు. ఆయనకిష్టమొచ్చింది చేసేయటం ఆయన స్పెషల్. అలబాయ్ జాతి కుక్క జాతి కోసం ఏకంగా ప్రత్యేకంగా సెలవు ప్రకటించడం చర్చనీయంగా మారింది.

తుర్క్‌మెనిస్థాన్‌ దేశంలో కుక్కకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు. ముఖ్యంగా అలబాయ్ జాతికి చెందిన కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు గర్భాంగులీ బెర్డ్‌ముఖమ్మెదొవ్‌‌కు నచ్చిన కుక్క జాతి కాబట్టి. అందుకే.. ఆ దేశ రాజధాని యష్గబత్‌ నడి బొడ్డులో బంగారంతో తయారు చేసిన 19 అడుగుల ఎత్తైన శునక విగ్రహాన్ని పెట్టించారు.

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ నెల చివరి ఆదివారాన్ని నేషనల్ హాలీడేగా నిర్ణయించామని..ఆ రోజును అలబాయ్ జాతి కుక్కలకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బెర్డ్‌ముఖమ్మెదొవ్‌ కుమారుడు సెర్దార్ మాట్లాడుతూ.. అది కేవలం సెలవు రోజు మాత్రమే కాదు..ఆ రోజు ప్రత్యేకంగా కుక్కల అందాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా..గత ఏడాది దేశ రాజధాని అష్గబాత్‌లో అలబాయ్ జాతి కుక్క  విగ్రహాన్ని  ప్రారంభించిన అధ్యక్షుడు..ఆ కుక్క గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అంతేకాదు ఆ జాతి కుక్కల గురించి ఒక పాట కూడా రాశారు.