×
Ad

Twitter New Feature : ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్‌.. ఒకే ట్వీట్‌లో ఫొటోలు, వీడియోలు పోస్ట్‌

ట్విట్టర్‌ లో కొత్త ఫీచర్‌ వచ్చింది. ఒకే ట్వీట్‌లో ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ ఫైల్‌, మీమ్స్‌లను పోస్ట్‌ చేసేలా కొత్త ఫీచర్‌ను ట్విట్టర్‌ తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్‌ చేయాల్సి ఉండేది.

  • Published On : October 10, 2022 / 08:52 AM IST

Twitter New Feature

Twitter New Feature : ట్విట్టర్‌ లో కొత్త ఫీచర్‌ వచ్చింది. ఒకే ట్వీట్‌లో ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ ఫైల్‌, మీమ్స్‌లను పోస్ట్‌ చేసేలా కొత్త ఫీచర్‌ను ట్విట్టర్‌ తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్‌ చేయాల్సి ఉండేది. యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.

Twitter Edit Option : ట్విట్టర్‌లో ఎడిట్ ఆప్షన్.. వారికి మాత్రమేనట.. భారతీయ యూజర్లకు ఊహించని షాక్..!

ప్రస్తుతం ఈ సేవలు భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని ట్విట్టర్‌ పేర్కొంది.