Blf Attacked On Pakistan Army Bases
BLF Attacked on Pakistan army bases :పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ రక్తసిక్తంగా మారింది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో సైనికులతో పాటు తిరుగుబాటు దారులు మరణించారు.పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ దాడికి తెగబడినట్లుగా తెలుస్తోంది.ఈ దాడికి పాల్పడింది తామే అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLF) తిరుగుబాటు బృందం రాయిటర్స్ రిపోర్టర్‌కు పంపిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ దాడుల్లో 100 మందికిపైగా పాక్‌సైనికలు మరణించినట్లు సమాచారం. కానీ కాగా పాక్ మాత్రం 50మందికి పైగా అని మాత్రమే చెబుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వింటర్ ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
Also read : India Boycott : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకులను బహిష్కరించిన భారత్
దీనిపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..ఉగ్రవాద దాడులను మా సైన్యం ధైర్యంగా తిప్పి కొట్టిందని ధైర్య సాహసాలు ప్రదర్శించిన మా భద్రతా బలగాలకు సెల్యూట్ చేస్తున్నాం’ అని ఖాన్ గురువారం (ఫిబ్రవరి 3,2022)ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం (ఫిబ్రవరి 2,2022) రాత్రి జరిగిన రెండు దాడులను – ఒకటి పంజ్‌గూర్ జిల్లాలోను మరొకటి నౌష్కీ జిల్లాలో జరిగిందని ఆ దాడులను తాము తిప్పికొట్టామని పాక్ సైన్యం తెలిపింది. బలూచిస్తాన్‌లోని సుసంపన్నమైన గ్యాస్, ఖనిజ వనరులను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా దోపిడీ చేస్తుందని, ప్రత్యేక రాష్ట్రం కోసం జాతి బలూచ్ గెరిల్లాలు దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాడుతున్నారు.
Also read : Karnataka Muslim Students: బురఖా ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకున్న ప్రిన్సిపాల్
బటూచ్ గెలిల్లాలు సాధారణంగా గ్యాస్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, భద్రతా దళాలపై దాడులు చేస్తారు. వారు చైనా ప్రాజెక్టులపై కూడా దాడి చేస్తారు. ప్రాజెక్ట్‌లను రక్షించడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని తెలిపారు.
బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ చొరవలో భాగమైన $60 బిలియన్ల చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ప్రావిన్స్‌లోని గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకుంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులకు భారత్ రహస్యంగా మద్దతు ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. దాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.