ఇస్లామిక్ చట్టాలలో సంస్కరణలు : ఇకపై UAEలో మందు తాగొచ్చు…సహజీవనం చేయొచ్చు

UAE relaxes Islamic laws యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) కీలక నిర్ణయం తీసుకుంది. దేశపు సమగ్ర ఇస్లామిస్ చట్టాలలో అతిపెద్ద సంస్కరణలు తీసుకొచ్చింది. మద్యంపై ఉన్న ఆంక్షలు,వివాహితులు కాని జంటల విషయంలో మరియు పరువు హత్యల విషయంలో ఉన్న రూల్స్ ని సంస్కరించింది. దేశపు ఆర్థిక,సామాజిక విధానానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లు సమాచారం.



యూఏఈ పర్యాటక కేంద్రం. అక్కడ పెద్ద పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు ఉన్నాయి. పర్యాటకులతో పాటు.. బిజినెస్‌ మీటింగ్‌ల కోసం చాలా మంది అక్కడికి వస్తుంటారు.. అందుకే ఆ దేశం పలు చట్టాలను సరళతరం చేస్తోంది. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కలిగించేందుకే ఈ సంస్కరణలను చేపట్టింది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌



తాజా సంస్కరణల ప్రకారం…ఇకపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మాత్రం మద్యం తాగడం చట్టవిరుద్ధం కాదు. ఇప్పుడు అక్కడ లిక్కర్‌ తాగొచ్చు. కాకపోతే 21 ఏళ్లు దాటి వుండాలి. అలాగే సహజీవనమూ చేయవచ్చు. అంటే పెళ్లికానివారు లేదా అవివాహితులు కూడా ఓ చోట నివసించవచ్చు. ఇక నుంచి పరువు హత్యలను కఠిన నేరంగా పరిగణిస్తుంది.



ఇప్పటివరకు,యూఏఈలో మద్యం సేవించినా, లిక్కర్‌ను కలిగివున్నా పెద్ద నేరం. అవివాహిత జంట కలిసి ఉండటం నేరంగా పరిగణించేవారు. ఇక తాజా నిర్ణయంతో ఆ ఆంక్షలు తొలగిపోయాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు