Uber: ప్రయాణికుడికి షాకిచ్చిన ఉబర్.. 15 నిమిషాల రైడ్‭కి రూ.32 లక్షలు చార్జ్

వెంటనే బాధితుడు సౌత్ వెస్ట్ న్యూస్ వారిని సంప్రదించి వారికి విషయం చెప్పాడు. గతంలో తాను చాలా సార్లు ఉబర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నానని, అయితే ఎప్పుడూ 11 నుంచి 12 డాలర్లు మాత్రమే చార్జ్ చేసే వారని, ఇప్పుడు అమాంతంగా ఇలా చేశారని పేర్కొన్నాడు. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‭కు బాధితుడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంత మొత్తంలో చార్జ్ పడడం చూసి వాళ్లు కూడా షాక్ అయ్యారు

Man charged rs 32 lakhs for 15 minute Uber journey

Uber: 15 నిమిషాల పాటు క్యాబ్‭లో ప్రయాణిస్తే ఎంతవుతుంది? మహా అయితే 300 రూపాయల నుంచి 500 అవుతుంది. సరే.. ఎంత లగ్జరీ అయినా వెయ్యి, రెండు వేల రూపాయలు దాటదు. కానీ ఉబర్ క్యాబులో ప్రయాణించిన బ్రిటన్‭కు చెందిన ఒక వ్యక్తికి 32 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. క్యాబ్ ప్రయాణం అనంతరం వచ్చిన మెసేజ్ చూసుకుని సదరు ప్రయాణికుడు ఒక్కసారి షాక్ అయ్యాడు. బ్రిటన్‭లోని మాంచెస్టర్‭లో వెలుగు చూసిందీ ఘటన.

వివరాల్లోకి వెళ్తే.. మాంచెస్టర్‭లోని బక్స్‭టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాడు ఇలివర్ కల్పన్ (22) అనే వ్యక్తి. తాను పని చేస్తున్న ప్రదేశం నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్‭వుడ్ ప్రాంతానికి తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్లాడు. అయితే రైడ్ ముగియగానే తనకు వచ్చిన మెసేజ్ చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు. ఎందుకంటే 38,317 అమెరికన్ డాలర్లు చార్జ్ చేసింది ఉబర్. ఇండియన్ కరెన్సీలో ఇది 32 లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది.

వెంటనే బాధితుడు సౌత్ వెస్ట్ న్యూస్ వారిని సంప్రదించి వారికి విషయం చెప్పాడు. గతంలో తాను చాలా సార్లు ఉబర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నానని, అయితే ఎప్పుడూ 11 నుంచి 12 డాలర్లు మాత్రమే చార్జ్ చేసే వారని, ఇప్పుడు అమాంతంగా ఇలా చేశారని పేర్కొన్నాడు. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‭కు బాధితుడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంత మొత్తంలో చార్జ్ పడడం చూసి వాళ్లు కూడా షాక్ అయ్యారు. అయితే కల్పన్ బుక్ చేసిన రైడ్ ఆస్ట్రేలియా అని ఉండడంతో అంత పెద్ద మొత్తంలో పడిందని వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. కల్పన్ ఖాతాలో అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేక ఉబర్ విత్ డ్రా చేసుకోలేకపోయిందట. లేదంటే కల్పన్‭కు కొత్త ఇబ్బందులు ఎదురయ్యేవి.

Cong President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ