Cong President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ
కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్.. శనివారం అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ ''ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో నా అభిప్రాయం చెప్పడం సరికాదు. పోటీలో ఉన్న ఇద్దరూ మంచి ప్రతిభావంతులు. గాంధీ కుటుంబ అనుయాయులు అని మాట్లాడటం మాత్రం సరికాదు'' అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరుగనున్నాయి. అక్టోబర్ 19న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.

Both the people have position says Rahul Gandhi on party presidential polls
Cong President Poll: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న రాహుల్.. చాలా రోజుల తర్వాత అధ్యక్ష ఎన్నికపై స్పందించారు. ప్రస్తుతం పోటీలో ఇద్దరు నేతలు ఉన్నారు. మల్లికార్జున ఖర్గే, శశి థూరూర్. అయితే వీరిద్దిరూ గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడిచేవారేనంటూ, నేరుగానే వారిని రిమోట్ కంట్రోల్ అంటూ అధికార భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణలను రాహుల్ నిర్ద్వంద్వంగా కొట్టివేశారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను అవమానించడమే అవుతుందని అన్నారు. అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ప్రతిభావంతులని, సమ ఉజ్జీలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తొలిసారి ఆయన పార్టీ అధ్యక్ష ఎన్నికలపై మాడ్లాడారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రంలో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్.. శనివారం అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ ”ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో నా అభిప్రాయం చెప్పడం సరికాదు. పోటీలో ఉన్న ఇద్దరూ మంచి ప్రతిభావంతులు. గాంధీ కుటుంబ అనుయాయులు అని మాట్లాడటం మాత్రం సరికాదు” అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరుగనున్నాయి. అక్టోబర్ 19న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ తదితరులు జోడో యాత్రలో ఉన్నందున బళ్లారిలోని యాత్ర క్యాంప్‌సైట్‌లో ఏర్పాటు చేసే పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు.
Bandi sanjay slams kcr: నల్లపిల్లితో కేసీఆర్ తాంత్రిక పూజలు.. ఓ స్వామీజీ చెప్పారు: బండి సంజయ్