సార్..రాత్రి ఫుల్ గా మందు కొట్టాను..ఇంకా మత్తు దిగలేదు..ప్లీజ్ లీవ్ కావాలి..అని మీ బాస్ ను అడిగితే..ఏం చేస్తాడు? ఏం వేళాకోళంగా ఉందా..మత్తు దిగాపోతే మజ్జిగ తాగి రా..అంటారా..లేదా ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తాడా? కచ్చితంగా ఉద్యోగం ఊడిపోవటం ఖాయం.
కానీ.. యూకేలోని ఓ కంపెనీ ‘హ్యాంగ్‌ఓవర్ డే’ సెలవునిస్తోంది. రాత్రంతా తాగి, ఉదయానికి కూడా మత్తు దిగకపోతే.. ఈ సెలవు వాడుకోవచ్చు. ఆహా మాక్కూడా ఇటువంటి అవకాశం మనక్కూడా ఉంటే ఏమి హాయి లే హలా..అనుకునేవారు ఎంతమందో..
ఇంగ్లాండ్‌లోని ఓ డిజిటల్ మార్కెటింగ్ సంస్థ ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రాత్రంతా మందుకొట్టి మత్తులో తూగే ఉద్యోగులు..ఉదయం ఆఫీసుకు రావడం కష్టమనీ..అలా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులు సరిగా పనిచేయరని అనుకున్నదో ఏమో గానీ ఈ ‘హ్యాంగ్‌ఓవర్ ఆఫ్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సెలవులు మద్యం తాగే ఉద్యోగులకు మాత్రమే కాదండోయ్..లేరికి కూడా వర్తిస్తుందట. ఉద్యోగులు మందు కొట్టకపోయినా..ఏదైనా కారణాల రాత్రి సమయంలో ఎక్కువ సేపు మెలకువగా ఉండి..ఉదయం నిద్ర లేవలేని పరిస్థితి ఉంటే కూడా ఈ సెలవు వాడుకోవచ్చుని తెలిపింది. లేదా ఇంట్లోనే ఉండి పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించింది.
ఈ సందర్భంగా ఆ సంస్థకు చెందిన ఎల్లీ ఎంట్విస్ట్‌లే మాట్లాడుతూ..నా ఫ్రెండ్ చాలామంది యూనివర్శిటీలో చదువుకుంటున్నారు. వారంతా షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. దాని వల్ల వీకెండ్స్ లో బైటకు రాలేరు. దీంతో మేమంతా గురువారం రాత్రి మందు కొడతాం. ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితుల్లో తరువాత రోజు శుక్రవారం సెలవు తీసుకోవచ్చని చెప్పాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అంతా..ముఖ్యంగా మందుబాబులు ‘హ్యాంగోవర్ హాలిడే’ ఇచ్చే కంపెనీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.