Rishi Sunak : యూకె ప్రధాని రిషి సునక్ దీపావళి వేడుకలను తన కుటుంబంతో కలిసి సౌతాంప్టన్‌లోని హిందూ దేవాలయంలో జరుపుకున్నారు. భజనలు పాడుతూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వీరికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Rishi Sunak : యూకే ప్రధానమంత్రి రిషి సునక్ పై ఎంపీ అవిశ్వాస లేఖ
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈసారి దీపావళి పండుగను సౌతాంప్టన్‌లో జరుపుకున్నారు. ఇది ఆయన స్వస్థలం. 1980 లో ఇక్కడ జన్మించారు. తను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నానని చెప్పడమే కాదు.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతగానో గౌరవిస్తారు. ఈ ఏడాది సౌతాంప్టన్‌లో ఓ హిందూ దేవాలయంలో తన కుటుంబంతో రిషి సునక్ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు.
రిషి సునక్ దీపావళి వేడుకలు జరుపుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఇద్దరు కుమార్తెలు, కృష్ణ ,అనౌష్కలతో కలిసి ఆలయంలో క్రింద కూర్చుని ‘రఘుపతి రాఘవ రాజారామ్’ అని భజనలు పాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీపావళి సందర్భంగా తను పుట్టిన ప్రాంతానికి రావడంతో రిషి సునక్ సంతోషంలో మునిగిపోయారు.
UK Bans Laughing Gas : ఇక లాఫింగ్ గ్యాస్‌పై నిషేధం…యూకే సంచలన నిర్ణయం
దీపావళి వేడుకలు సౌతాంప్టన్‌కే పరిమితం కాలేదు. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వరకు జరుపుకున్నారు. డౌనింగ్ స్ట్రీట్‌లోని హిందూ సమాజ సభ్యులకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చారు రిషి సునక్.
.
Diwali night Bhajan by PM Rishi Sunak & family at Southampton Mandir .गर्व से कहो हम हिंदू है। pic.twitter.com/2Zx6oVpHQQ
— Minni Razdan (@mini_razdan10) November 14, 2023