Russian Soldiers Cannibalism: వామ్మో.. మనుషులను చంపి తింటున్న రష్యా సైనికులు..? యుక్రెయిన్ సంచలన ఆరోపణలు..
మరో కథనం ప్రకారం తన సహచరుడు మానవ అవశేషాలను తిన్నాడని ఒక సైనికుడు అంగీకరించినట్లు తెలిసింది. రష్యన్ సైనికుల్లో సరఫరాల కొరత, ఆకలి పరిస్థితులు, అలసటతో ఈ సంఘటనలు ముడిపడి ఉన్నాయని యుక్రేనియన్ వర్గాలు చెబుతున్నాయి.
- Naveen
- Published on- April 30, 2026 / 11:51 PM IST
Russian Soldiers Cannibalism: రష్యా సైనికుల గురించి యుక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది. యుక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధంలో ఆహారం లేక అలమటిస్తున్న రష్యా సైనికులు మనుషులను చంపి తింటున్నారని చెప్పింది. తీవ్రమైన ఆహార కొరత, కఠినమైన శీతాకాల పరిస్థితుల కారణంగా కొంతమంది రష్యన్ సైనికులు నరమాంస భక్షణకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసింది.
ఒక నివేదిక ప్రకారం రష్యన్ సైనికులు తమ తోటి సైనికులను చంపి తిన్నట్లు ఆరోపణలు ఉన్న కనీసం ఐదు కేసులు నమోదయ్యాయని యుక్రెనియన్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 2025లో ఒక సైనికుడు ఇద్దరు సహచరులను చంపి వారిలో ఒకరి మృతదేహంలోని కొంత భాగాన్ని తినడానికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి.
మరో కథనం ప్రకారం తన సహచరుడు మానవ అవశేషాలను తిన్నాడని ఒక సైనికుడు అంగీకరించినట్లు తెలిసింది. రష్యన్ సైనికుల్లో సరఫరాల కొరత, ఆకలి పరిస్థితులు, అలసటతో ఈ సంఘటనలు ముడిపడి ఉన్నాయని యుక్రేనియన్ వర్గాలు చెబుతున్నాయి.
గత సంవత్సరం నవంబర్ లో దొనెట్స్క్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ రష్యా సైనికుడు.. తన సహచర సైనికులు ఇద్దరిని చంపేశాడు. వాళ్లలో ఒక సైనికుడి శవం కాలు నరికి గ్రైండర్‌లో ముద్ద చేసి తినేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు యూనిట్ సైనికాధికారి తన పై అధికారికి వాయిస్ నోట్ రూపంలో నివేదిక పంపాడని సమాచారం. గత ఏడాది అక్టోబర్ లో ఉదాచ్నె ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ యూనిట్ కమాండర్.. తన కింది సిబ్బందిలో ఒకరితో.. ‘యుక్రెయిన్లను ఎందుకు తింటున్నావ్? మనుష్యులను తినటం మానెయ్’ అని అరిచినట్లు నివేదికలో ఉంది.
రష్యా, యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో రష్యా దళాలకు కనీస ఆహారం అందక సైనికులు తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నారుని, సరైన తిండి దొరక్క ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆకలి బాధలు తట్టుకోలేక రష్యా సైనికులు నరమాంస భక్షణకు పాల్పడుతున్నారని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయుధాల సరఫరాపై ఉన్న శ్రద్ధ ఆహారంపై లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని తెలుస్తోంది.
రష్యా సైనికులు నరమాంసభక్షణకు పాల్పడుతున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఆ ఆరోపణల్లో నిజం లేదంది. అవన్నీ పుకార్లేనని, యుక్రెయిన్ సృష్టించిన అబద్ధాలని రష్యా సీరియస్ అయ్యింది.
Also Read: ఇరాన్ పై మళ్లీ దాడులకు దిగితే మీకే డేంజర్- ట్రంప్ కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
