Putin Warning: ఇరాన్ పై మళ్లీ దాడులకు దిగితే మీకే డేంజర్- ట్రంప్ కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ తో ఉద్రిక్త వాతావరణం ముగించేందుకు గాను అవసరమయ్యే దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పుకొచ్చారు.
Putin Warning: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై మళ్లీ దాడులకు దిగితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకో తెలిపారు. యుక్రెయిన్ యుద్ధం, మిడిలీస్ట్ లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు 90 నిమిషాలకుపైగా ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఇరాన్ తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారని యూరి తెలిపారు. ఈ పరిణామాలతో దౌత్య చర్చలకు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పై దాడులకు దిగితే మిడిలీస్ట్ దేశాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వెల్లడించారు.
ఇక ఇరాన్ తో ఉద్రిక్త వాతావరణం ముగించేందుకు గాను అవసరమయ్యే దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి ఇరు దేశాల నేతలు చర్చించుకున్నట్లుగా తెలిపారు. ఇరాన్ దగ్గర ఉన్నటువంంటి శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి పుతిన్ తో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పినట్లు పేర్కొన్నారు.
మరోవైపు తాను సాయం పొందే ముందు ఇరాన్ తో యుద్ధాన్ని తాము ముగించాలని అనుకుంటున్నట్లుగా ట్రంప్ తెలిపారు. త్వరలో యుక్రెయిన్ లో కాల్పుల విరమణకు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు కొద్ది రోజుల కాల్పుల విరమణను సూచించారని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని ట్రంప్ అన్నారు.
Also Read: ఇరాన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్..! మెరుపు దాడులకు అమెరికా ప్లాన్..!
