US Iran War: ఇరాన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్..! మెరుపు దాడులకు అమెరికా ప్లాన్..!
చర్చల విషయంలో ఇరాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో సైనిక చర్యకు దిగాలనే ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా తెలిపింది.
US Iran War: ఇరాన్ పై మెరుపు దాడులకు అమెరికా ప్లాన్ చేస్తోంది. వార్ ముగింపు చర్చల విషయంలో సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ మరికొన్ని గంటల్లో దాడులపై ట్రంప్ కు బ్రీఫింగ్ ఇవ్వబోతోంది. ఇరాన్ పై సైనిక చర్యలు, హర్మూజ్ నియంత్రణ చర్యలతో పాటు ఇరాన్ యురేనియం నిల్వల స్వాధీనంపై ట్రంప్ కు వివరించబోతున్నారు. ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దాడులు చేయబోతున్నట్లుగా సెంట్రల్ కమాండ్ అధికారులు తెలిపారు. చర్చల విషయంలో ముందడుగు పడేలా స్వల్ప కాలంలో శక్తిమంతమైన దాడులకు అమెరికా ప్లాన్ చేసింది.
చర్చల విషయంలో ఇరాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో సైనిక చర్యకు దిగాలనే ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్ ను దెబ్బతీస్తూనే పూర్తి స్థాయి యుద్ధం రాకుండా మెరుపు దాడులు చేయాలని అమెరికా సైన్యం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. అమెరికా చర్యలతో మరోసారి మిడిలీస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అటు అమెరికాకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంలో విరుచుకుపడతామని ఇరాన్ నేవీ కమాండర్ వార్నింగ్ ఇచ్చారు. మా కొత్త వెపన్ అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్ ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే అమెరికాపై ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. అతి త్వరలోనే శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామన్న ఇరాన్ నేవీ కమాండర్.. ఈ వెపన్ ఎఫెక్ట్ తో అమెరికాకు హార్ట్ ఎటాక్ కూడా రావొచ్చన్నారు. అది ఏ రకం ఆయుధం, ఎప్పుడు ప్రయోగిస్తారు అనే విషయం మాత్రం చెప్పలేదు. తాము దౌత్యానికి అవకాశం ఇస్తున్నామని తెలిపిన ఇరాన్ నేవీ కమాండర్, తమ సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అవసరమైతే కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించారు.
