Zelensky : జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్ర…యుక్రెయిన్ మహిళ గూఢచర్యం

యుక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నినట్లు తాజాగా వెల్లడైంది. జులై 27వతేదీన యుక్రెయిన్ పోర్ట్ సిటీ మైకోలైవ్‌ లో జెలెన్స్కీ పర్యటన సందర్భంగా అతన్ని హతమార్చేందుకు రష్యా కుట్ర పన్నినట్లు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ వెల్లడించింది....

Zelensky : యుక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నినట్లు తాజాగా వెల్లడైంది. జులై 27వతేదీన యుక్రెయిన్ పోర్ట్ సిటీ మైకోలైవ్‌ లో జెలెన్స్కీ పర్యటన సందర్భంగా అతన్ని హతమార్చేందుకు రష్యా కుట్ర పన్నినట్లు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ వెల్లడించింది. (Ukraine detains woman for spying) యుక్రెయిన్ మిలటరీ స్టోరులో పనిచేసిన ఓ మహిళ రష్యా కోసం గూఢచర్యం చేసిందని యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది. (spying on Zelensky for Russia)

Balochistan Blast : పాకిస్థాన్‌లో పేలుడు…ఏడుగురి మృతి

జెలెన్స్కీ మైకోలైవ్ రహస్య పర్యటన సమాచారాన్ని యుక్రెయిన్ మహిళా గూఢచారి రష్యాకు చేరవేసిందని, ఈ సమాచారంతో రష్యా వైమానిక దాడి ద్వారా జెలెన్క్సీని హత మార్చేందుకు ప్లాన్ రూపొందించారని సమాచారం. జెలెన్క్సీ పర్యటన రూట్ మ్యాప్, సమయం తదితర వివరాలను మహిళా గూఢచారిణి రష్యాకు పంపిందని తేలింది.

Zomato Now Charging : జోమాటో ప్రతీ ఆర్డరుపై రూ.2 అదనపు చార్జీ

ఓచకోవ్ నగరవాసి అయిన మహిళా గూఢచారిని యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తోంది. దేశ ద్రోహి అయిన మహిళా గూఢచారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, జెలెన్క్సీ పర్యటన సందర్భంగా అదనపు భద్రతా ఏర్పాటు చేశారు. మహిళా గూఢచారి దోషిగా తేలితే ఆమెకు 12 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు