Ukraine No Fly Zone Nato Rejects Ukraine No Fly Zone, Unhappy Zelenskiy Says This Means More Bombing
Ukraine no fly Zone : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. తమ డిమాండ్లకు తలొగ్గితే తప్పా యుద్ధాన్ని ఆపేది లేదని రష్యా తెగేసి చెప్పేసింది. యుక్రెయిన్ తమ దేశాన్ని రక్షించుకునేందుకు శక్తిమేరకు పోరాడుతోంది. యుక్రెయిన్ పౌరులు కూడా తమవంతుగా దేశం కోసం పోరాటం చేస్తున్నారు. ఒకవైపు ఇరుదేశాల మధ్య శాంతిపరమైన చర్చలు జరుపుతూనే మరోవైపు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి ఇరుదేశాలు. చర్చలకు సిద్ధమని యుద్ధాన్ని ఆపేయాలని యుక్రెయిన్ కోరుతోంది. కానీ, ఇంతవరకు వచ్చిన తర్వాత తగ్గేదే లే అన్నట్టుగా పుతిన్ బలగాలు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు వారించినా పుతిన్ లెక్కచేయలేదు. నాటో దేశాలు సైతం మౌనంగా ఉండిపోయాయి. పుతిన్ సేన ఇప్పటికే యుక్రెయిన్ ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకుంటోంది.
యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్లు, ప్రధాన నగరాలే లక్ష్యంగా రష్యా బలగాలు దూసుకొస్తున్నాయి. అణు కేంద్రాలు ఉన్న ప్రాంతంలో దాడులు చేయొద్దని రష్యాకు సూచించినప్పటికీ ఆ దేశ బలగాలు ఆ ప్రాంతాలనే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. రష్యా దాడుల్లో అణు విద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్‌లోని చెర్నోబిల్ ఘటన పునరావృతం అవుతుందనే ఆందోళన ఎక్కువుతోంది. వాస్తవానికి ఈ అణు రియాకర్లు ఎన్నో ఏళ్ల క్రితమే ఇక్కడ నిర్మించారు. యుక్రెయిన్ కూడా వాటి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యా వైమానిక దాడులు చేయడాన్ని యుక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.
Ukraine No Fly Zone Nato Rejects Ukraine No Fly Zone, Unhappy Zelenskiy Says This Means More Bombing
Ukraine no fly Zone : నాటో తిరస్కరణపై జెలెన్ స్కీ ఆగ్రహం.. బాంబుల దాడికి పిలుపునిచ్చినట్టే.. !
ఈ క్రమంలోనే యుక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. నో ఫ్లైజోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది. అలా చేస్తే.. ఐరోపాలో పెను యుద్ధానికి దారితీస్తుందన్న నాటో హెచ్చరిస్తోంది. యుక్రెయిన్ గగనతలంలో నో ఫ్లై జోన్ ఏర్పాటుకు తిరస్కరించినుందుకు ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడుతున్నారు. నాటా నిర్ణయంతో యుక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా మరింత బాంబు దాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అవుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 24న రష్యా భూమి, సముద్రం, వాయుమార్గం ద్వారా యుక్రెయిన్ పై ఏకకాలంలో దాడులకు తెగబడింది.
ఈ క్రమంలోనే యుక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ గతంలోనే నాటోను అభ్యర్థించారు. అయితే రష్యా వైమానిక దాడుల నుంచి యుక్రెయిన్ రక్షించడానికి నాటో సాయం చేసేందుకు తిరస్కరించింది. తూర్పు ఐరోపాను యుద్ధంలోకి లాగడానికి నాటో కూటమి ఇష్టపడటం లేదు. నాటో కూటమి నిర్ణయంతో యుక్రెయిన్ అధ్యక్షుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల మద్దతు ఉండి కూడా సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరూ తమకు సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఒంటరిగానే రష్యాతో పోరాడుతోంది యుక్రెయిన్. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Read Also : Russia Ukraine War : రష్యా గుప్పిట్లో యుక్రెయిన్.. రెండో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా దాడులు..!