Ukraine – Russia War : టర్కీ టాక్స్ సక్సెస్.. యుక్రెయిన్ ‌- రష్యా యుద్ధం ఇక ముగిసినట్టే..!

Ukraine - Russia War : యుక్రెయిన్, రష్యా మధ్య నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఎట్టకేలకు ఓ కీలక అడుగు పడింది. ఇప్పటివరకూ నువ్వానేనా అన్నట్లు బాంబులతో విరుచుకుపడ్డాయి.

Ukraine – Russia War : యుక్రెయిన్, రష్యా మధ్య నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఎట్టకేలకు ఓ కీలక అడుగు పడింది. ఇప్పటివరకూ నువ్వానేనా అన్నట్లు బాంబులతో విరుచుకుపడిన ఇరుదేశాలు రాజీదిశగా ముందడుగు వేశాయి. అంతర్జాతీయపరంగా శాంతి చర్చల ఒప్పందానికి అంగీకరించాయి. ఈ నేపథ్యంలో రష్యా ఒక మెట్టు దిగొచ్చింది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఉత్తర ప్రాంత నగరం చెర్నివ్‌ సమీపంలో రష్యా తమ సైనిక కార్యకలాపాలు తగ్గించుకునేందుకు అంగీకరించింది. రష్యా డిమాండ్లకు యుక్రెయిన్ అంగీకరించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య 3 గంటలపాటు చర్చలు కొనసాగాయి. అయితే ఈ చర్చలు చాలావరకు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. కీవ్‌, చెర్నివ్‌ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రష్యా సేనలను విత్ డ్రా చేసుకోవడం గమనించినట్లు యుక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. అంతర్జాతీయ శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంలో రెండు దేశాలు చర్చించుకున్నాయి.

సైన్యం ఉపసంహరణతో పాటు యుక్రెయిన్‌ భద్రత హామీపైనే ఎక్కువ సమయం చర్చించారు. రష్యా డిమాండ్‌ తగినట్టుగా యుక్రెయిన్ నాటోలో చేరకుండా తటస్థంగా ఉంటుందని యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చర్చల సందర్భంగా తమ నిర్ణయాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. డాన్‌బాస్‌ ప్రాంతంపైనా కూడా తాము రాజీ పడతామని చెప్పారు. ఇరుపక్షాలూ ఒక్కో మెట్టు దిగిరావడంతో యుద్ధానికి ఇక తెరపడినట్టేనని రష్యా ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చాలా సమయం తీసుకుంటుందన్నారు. ఇస్తాంబుల్‌ చర్చలు సఫలమమైన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ త్వరలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ukraine, Russia Hold New Talks In Turkey Aimed At Ending The Fighting

ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు సిద్ధంగా ఉన్నామని టర్కీ ప్రకటించింది. మాస్కో ముప్పుగా భావించే నాటోలో చేరాలనే ఆశను యుక్రెయిన్ వదులుకోవాలని రష్యా ఎప్పుడినుంచో డిమాండ్ చేస్తోంది. యుక్రెయిన్ తన తటస్థతను ప్రకటించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఏదైనా ఒప్పందంలో భాగంగా దేశానికి దాని సొంత భద్రతా హామీలు అవసరమని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు జెలెన్ స్కీ అందుకు సిద్ధంగా ఉన్నట్టు Zelenskyy సూచించాడు.

మరోవైపు యుక్రెయిన్ దక్షిణాదిలోని మూడు నగరాల నుంచి పౌరులను తరలించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. భారీ బాంబులున్న మారియుపోల్‌తో పాటు ఎనర్‌హోదర్, మెలిటోపోల్ నుంచి మానవతా కారిడార్లు నడుస్తాయని ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్‌చుక్ చెప్పారు. ప్రస్తుతం రెండు నగరాలు రష్యా నియంత్రణలో ఉన్నాయి. అయితే మాస్కో కారిడార్‌లకు ఎంతమేరకు అంగీకరించిందో వెరెష్‌చుక్ ప్రస్తావించలేదు. 880 మంది వ్యక్తులు ఒక రోజు ముందుగానే మారియుపోల్ నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా వెళ్లిపోయారని ఉప ప్రధాని ఇరినా వెరెష్ చుక్ తెలిపారు.

Read Also : Russia Armed Forces Killed : యుద్ధంలో 17,200 మంది రష్యన్ సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ

ట్రెండింగ్ వార్తలు