యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. కశ్మీర్ లో పరిస్థితులను అంచనా వేయాలని చైనా విన్నవించింది. డిసెంబరు 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సెక్యూరిటీ కౌన్సిల్ కు లెటర్ రాశారు. కశ్మీర్లో పరిస్థితి గతి తప్పిందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని సెక్యూరిటీ కౌన్సిల్ జోక్యాన్ని కోరారు. చైనా కోరిక మేరకు మంగళవారం యు.ఎన్. సెక్యూరిటీ కౌన్సిల్ కశ్మీర్ అంశాన్ని అత్యవసరంగా చర్చించేందుకు సమావేశమవుతోంది.
మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు తర్వాత పరిస్థితులను అంచనా వేసేందుకు కౌన్సిల్ సమావేశమవుతున్నట్లు యుఎన్ సమాచారం. ఆగస్ట్‌లో జరిగినట్లుగానే ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. అప్పుడూ పాకిస్థాన్ మిత్రుడు చైనా అభ్యర్ధన మేరకు కౌన్సిల్ కలిసింది.
‘పరిస్థితుల తీవ్రత, పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం పొంచి ఉన్నందున పాకిస్థాన్ అభ్యర్ధన మేరకు చైనా జమ్మూ, కశ్మీర్ స్థితిగతుల మీద కౌన్సిల్ కు వివరించాలని కోరుకొంటున్నాను’ అని కౌన్సిల్ కు పంపిన లెటర్‌లో చైనా తెలిపింది. అధికార ప్రకటన లేకపోయినా, మంగళవారమే కౌన్సిల్ సమావేశం జరుగుతుందనేది సమాచారం.