Shocking : గర్భవతి అని తెలిసిన రెండు రోజులకే పండంటి బిడ్డను ప్రసవించిన మహిళ

గర్భం దాల్చానని తెలిసిన రెండు రోజులకే బిడ్డను ప్రసవించింది ఓ మహిళ. అసలు తాను గర్భంతో ఉన్నాననే విషయమే తెలియదు ఆమెకు. నువ్వు గర్భవతివి అని డాక్టర్లు చెప్పినా నమ్మలేదు. కానీ స్కానింగ్ లో తెలుసుకుని షాక్ అయ్యింది. ఆమె షాక్ నుంచి కోలుకోకుండానే కేవలం రెండు రోజులకే బిడ్డను ప్రసవించింది.

US  Woman Gives Birth Just 48 Hours After She Realised She Was Pregnant

Shocking : గర్భం దాల్చానని తెలిసిన రెండు రోజులకే బిడ్డను ప్రసవించింది ఓ మహిళ. అసలు తాను గర్భంతో ఉన్నాననే విషయమే తెలియదు ఆమెకు. నువ్వు గర్భవతివి అని డాక్టర్లు చెప్పినా నమ్మలేదు. స్కానింగ్ తీశాక డాక్డర్ కడుపులో బిడ్డ ఉందని చెబితే కూడా నమ్మలేకపోయిందామె. షాక్ అయ్యింది. ఇటీవల తనకు బీపీ పెరిగిందని అలాగే బరువు కూడా పెరిగానని అదే కానీ గర్భవతిని అని మాత్రం తెలియలేదని కానీ తాను గర్భవతిని అని తెలిసిన రెండు రోజులకే తనకు బిడ్డ పుట్టటం షాక్ ఆనందం కలగలిన అనుభూతిలో ఉన్నానని తెలిపిందామె. ఎక్సర్‌సైజ్‌లు చేయకపోవడంతో కొంచెం బరువు పెరిగానని అనుకున్నాను తప్ప గర్భవతినని ఏమాత్రం అనుమానం రాలేదని చెబుతోంది అమెరికాకు చెందిన ఓ మహిళ.

పేయ్‌టన్ స్టోవర్ అనే మహిళ టీచర్. వయస్సు 23 ఏళ్లు. భర్తతో కలిసి ఒమాహాలో నివాసం ఉంటోంది. స్టోబర్ కొంత కాలం క్రితమే ఆమె కొత్త ఉద్యోగంలో చేరింది. ఈక్రమంలో ఆమెకు తల తిరిగినట్లుగా, వాంతికి వచ్చినట్లుగా అనిపించేంది. బరువు కూడా పెరిగింది. పని ఒత్తిడివల్ల కావచ్చని లైట్‌ తీసుకుంది. తరువాత కాళ్లలో వాపు వచ్చింది. దాంతో భయపడిపోయిన స్టోవర్‌ హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లు విషయం చెప్పింది.

ఆమెను పరీక్షించినడాక్టర్లు ప్రెగ్నెంట్ అని చెప్పారు. స్టోవర్ షాక్ అయ్యింది. నమ్మలేదు. మరోసారి పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో కూడా ఆమె గర్భిణి అని తేలింది. అయినా నమ్మకం కుదరకపోవడంతో అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేయించుకుంది. కడుపులో బిడ్డ ఉన్నట్లు స్కానింగ్‌లో క్లియర్‌గా కనిపిచడంతో షాక్ అయ్యింది. పైగా గర్భం వచ్చి ఆరు నెలలు దాటిందని వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ షాకయ్యారు.

ప్రెగ్నెన్సీతోపాటు అత్యంత అరుదుగా వచ్చే ప్రీక్లామ్‌ప్సియా అనే రుగ్మత స్టోవర్‌లో ఉందని, దీనివల్ల బీపీ ఎక్కువై కిడ్నీలు, కాలేయం పనితీరు మందగిస్తుందని.. ఇది ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పటంతో స్టోవర్‌ దంపతులు ఆందోళనకు గురి అయ్యారు. డాక్టర్లు సూచనల ప్రకారం నడుచుకున్నారు. అలా ఆమె ఆస్పత్రిలో చేరగా.. 48 గంటల్లో సర్జరీ చేసి తల్లీబిడ్డ ఇద్దరినీ కాపాడారు. కిలో 800 గ్రాముల బరువుతో మగబిడ్డ జన్మించాడు.

అలా స్టోవర్ కు గర్భవతిని అని తెలిసిన 48 గంటల్లోనే కొడుకు పుట్టేసరికి సంబ్రమాశ్యర్యాలకు లోనైంది. ఇది కలా, నిజమా అని ఆశ్చర్యపోతున్నారు స్టోవర్ దంపతులు. కాగా, ఆరు నెలల గర్భిణి అయినా స్టోవర్‌ పొట్ట లావుగా బయటికి కనిపించకపోవడానికి ప్రీక్లామ్‌ప్సియా కారణం అయివుండవచ్చని డాక్టరు తెలిపారు. ఇలాంటివి అత్యంత అరుదుగా సంభవిస్తాయని తెలిపారు.