Train Accident: అమెరికాలో పట్టాలు తప్పిన రైలు.. 50మంది పరిస్థితి విషమం
అమెరికాలో మోంటానాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 50మంది పరిస్థితి విషమంగా ఉంది. మోంటానాలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది.
- Subhan Ali Shaik
- Updated on- September 26, 2021 / 12:00 PM IST
Train Accident
Train Accident: అమెరికాలో మోంటానాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 50మంది పరిస్థితి విషమంగా ఉంది. మోంటానాలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సియాటెల్ నుంచి చికాగో మధ్య నడిచే రైలులో దాదాపు 147మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 13మంది సిబ్బంది ఉన్నారు.
శనివారం సాయంత్రం 4 గంటలకు జోప్లిన్ వద్ద ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ప్రమాదస్థలం నుంచి కెనడాకు 48కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే రైలు యాజమాన్య సంస్థ స్థానిక అధికారులతో మాట్లాడి క్షతగాత్రులను తరలించే ప్రయత్నం చేస్తుంది. ఐదు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.
సోషల్ మీడియాలో సంబంధించిన ఫొటోలు పోస్టు చేయగా.. ప్రయాణికులను మోసుకెళ్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. పూర్తిగా పక్కకు జరిగిపోయి ఉన్న ఐదు భోగీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
