Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు

అన్ని పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు అక్టోబరు నెలలో 21రోజుల పాటు సెలవుల్లో ఉండనున్నాయి. రెండో, నాలుగో శనివారాలతో పాటు పండగ రోజులు కలుపుకుని ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇలా...

Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు

October Holiday

Bank Holidays: అన్ని పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు అక్టోబరు నెలలో 21రోజుల పాటు సెలవుల్లో ఉండనున్నాయి. రెండో, నాలుగో శనివారాలతో పాటు పండగ రోజులు కలుపుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇలా ఉన్నాయి. అక్టోబరులో ఉన్న స్పెషల్ డేస్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు బోలెడు సెలవులు తీసుకునేందుకు డేట్స్ ఫిక్స్ అయిపోయాయి.

మూడు కేటగిరీలుగా ఆర్బీఐ సెలవులు విడదీస్తారు. రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల సెలబ్రేషన్ ను బట్టి 21రోజుల వరకూ తీసుకోవచ్చు. ఇందులో ఆర్బీఐ ఇష్యూ చేసింది మాత్రం 14మాత్రమే. మిగిలిన ఏడు సెలవులు వీకెండ్ లీవ్స్. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలుపుకుని ఇలా ఉన్నాయి.

…………………………….. : గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు

1) October 1 – హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ బ్యాంక్ అకౌంట్స్ (గ్యాంగ్‌టక్)

2) October 2 – మహాత్మాగాంధీ జయంతి

3) October 3 – ఆదివారం

4) October 6 – మహాలయ అమావాస్య (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా)

5) October 7 – మేరా చౌరెన్ హౌబా (ఇంఫాల్)

6) October 9 – రెండో శనివారం

7) October 10 – ఆదివారం

8) October 12 – దుర్గా పూజ (మహా సప్తమి) / (అగర్తలా, కోల్‌కతా)

9) October 13 – దుర్గా పూజ (మహా అష్టమి) / (అగర్తలా, కోల్‌కతా, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇంఫాల్, పట్నా, రాంచీ)

10) October 14 – దుర్గా పూజ (మహా నవమి) (అగర్తలా, బెంగళూరు, చెన్నై, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇంఫాల్, పట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం)
11) October 15 – దుర్గా పూజ/దసరా (విజయ దశమి) / (ఇంఫాల్ .. సిమ్లా మినహాయించి అన్నీ)

12) October 16 – దుర్గా పూజ (దసైన్) / (గ్యాంగ్‌టక్)

13) October 17 – ఆదివారం

14) October 18 – కటి బిహు (గువాహటి)

15) October 19 – మిలాద్ ఉన్ నబీ (అహ్మదాబాద్, బెలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూ ఢిల్లీ, రాయ్పూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం
16) October 20 – మహర్షి వాల్మీకి బర్త్ డే (అగర్తలా, బెంగళూరు, చంఢీఘడ్, కోల్‌కతా, షిమ్లా)

17) October 22 – ఈద్ ఉల్ మిలాద్ ఉన్ నబీ (జమ్మూ, శ్రీనగర్)

18) October 23 – నాలుగో శనివారం

19) October 24 – ఆదివారం

20) October 26 – యాక్సెషన్ డే (జమ్మూ, శ్రీనగర్)

21) October 31 – ఆదివారం