Gulab Hurricane : గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు

గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. కొన్నింటి గమ్యాలను కుదించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుతుపుతున్నారు. ఒడిశా మీదుగా వెళ్లే 24 రైళ్లను రద్దు చేశారు.

Gulab Hurricane : గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు

Harricane

Several trains canceled : గులాబ్‌ తుపాను గుబులు రేపుతోంది. తీరం వైపుగా దూసుకొస్తోంది. దీంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాకు గులాబ్‌ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాను మారింది. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ సాయంత్రం ఇది గోపాల్‌పుర్‌, కళింగపట్నం మధ్య తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది.

గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు పలు రైళ్లను రద్దు అయ్యాయి. కొన్నింటి గమ్యాలను కుదించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుతుపుతున్నారు. ఒడిశా మీదుగా వెళ్లే 24 రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 26న విశాఖ-విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ-విజయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 27 న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

Cyclone : గులాబ్ గుబుల్, తుపాన్ ముప్పు..సాయంత్రం తీరం దాటే అవకాశం

గులాబ్‌ తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ దీని ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ఈ జిల్లా్లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. రానున్న 18 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి , దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని ప్రకటించింది.

ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో కళింగపట్నం, దాని పరసర ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర నీరు చొచ్చుకొచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

MLA Malladi Vishnu : పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరు : మల్లాది విష్ణు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. దాదాపు 60వేల మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 86 వేల మందిని షెల్టర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గులాబ్‌ తుఫాన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు మొత్తం 18 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. ఆర్మీ, నౌకా దళానికి చెందిన రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు.. తహసీల్దార్లు, ఆర్డీవోలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో 8 వేల కుటుంబాలను గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ చేపట్టారు. సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

India Diesel : దేశ వ్యాప్తంగా పెరిగిన డీజిల్ ధర

విశాఖపట్నంలో ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఉత్తరాంధ్రలో 24 గంటలూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సేవలకు వినియోగించనున్నారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.