MLA Malladi Vishnu : పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరు : మల్లాది విష్ణు

పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ స్పీచ్‌లో అనవసర విమర్శలు ఉన్నాయన్నారు. పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరన్నారు.

MLA Malladi Vishnu : పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరు : మల్లాది విష్ణు

Malladi

Malladi Vishnu criticized Pawan Kalyan : పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ స్పీచ్‌లో అనవసర విమర్శలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వంతో నిర్మాతలు, డిస్ట్రి బ్యూటర్లు చర్చలు జరిపారని తెలిపారు. వారంతా సానుకూలంగా మాట్లాడారన్నారు. పవన్‌ రాజకీయంగా ఉన్న బాధను వెళ్లగక్కారని మల్లాది విష్ణు మండిపడ్డారు. పవన్‌ మాట్లాడిన తీరు సరిగా లేదని మల్లాది విష్ణు అన్నారు. పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరని తెలిపారు.

సినిమా ఫంక్షన్‌లో రాజకీయ మాటలెందుకని ప్రశ్నించారు. రెమ్యునరేషన్స్ కోల్పోవాల్సి వస్తుందనే ఈ అక్కసు అని ఎద్దేవా చేశారు. యాక్టర్లు రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడాలి తప్ప.. టికెట్ల గురించి వారికి ఏం సంబంధమని మల్లాది విష్ణు ప్రశ్నించారు. మంత్రి గురించి మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. అప్రజాస్వామిక దోపిడీని అరికడుతామన్నారు. బెన్‌ఫిట్‌ షో పేరు మీద దోపిడీ జరుగుతోందని.. ఆ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్‌ను మరోసారి బయటపెట్టాయి. తనను టార్గెట్‌ చేసుకుని ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను వేధిస్తుందని పవన్ ఆరోపించారు. చిరంజీవి వంటి ప్రధాన సినిమా ఇండస్ట్రీ నేతలందరు తనతో మాట్లాడుతున్నారని ఇటీవల మంత్రి పేర్నినాని ఇచ్చి స్టేట్‌మెంట్‌కు కౌంటర్ ఇచ్చారు. థియేటర్లు ఓపెన్‌ చేయాలని ఎవరినీ చిరంజీవి బ్రతిమాలొద్దని. బ్రతిమాలితే పనులు కావన్నారు. సీఎంను కలిసి విన్నవిస్తే సమస్యలు పరిష్కారం కాబోవన్నారు.

పవన్ కల్యాణ్ వైసీపీని టార్గెట్ చేశారు. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా విరుచుకుపడ్డారు. వైసీపీ రిపబ్లిక్‌ కాదు, ఇండియన్‌ రిపబ్లిక్‌ అన్నారు. సినిమా ఆపేస్తే భయపడతామనుకున్నారా అని అన్నారు. ప్రభుత్వం ఏ పనీ చేయకపోతే చాలు..సినమా వాళ్లు పనిచేస్తే డబ్బులు వస్తాయని తెలిపారు. చిత్రసీమ వైపు చూస్తే కాలిపోతారు జాగ్రత్త అని హెచ్చరించారు.

Pawan Kalyan : తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు-పవన్ కళ్యాణ్

పవర్‌ లేని వాడు పవర్‌ స్టార్‌ ఏంటని ప్రశ్రించారు. సినిమా వాళ్లకు ఇబ్బందుకు వస్తున్నాయని తెలిపారు. ఇబ్బందులపై సినీ పెద్దలు మాట్లడటం లేదని చెప్పారు. మోహన్‌ బాబు ఇబ్బందులపై మాట్లాడాలన్నారు. ఇండస్ట్రీ కోసం చిరంజీవి ఎవరినీ బ్రతిమాలొద్దన్నారు. సీఎంను కలిసి విన్నవిస్తే సమస్యలు తీరవని పేర్కొన్నారు. సినిమా హక్కుతో నిగ్గతీసి ప్రభుత్వాన్ని అడగాలన్నారు.