Trump Deportation : విదేశీ పౌరులకు అమెరికా వార్నింగ్.. 30 రోజుల్లోగా మీకు మీరే దేశం వదిలి వెళ్లిపోండి.. లేదంటే జైలుకే..!

Trump Deportation : 30 రోజులకు మించి అమెరికాలో ఉన్నవారు వెంటనే తిరిగి దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించింది. లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఉల్లంఘిస్తే.. జరిమానా లేదా అరెస్టు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

Trump Deportation Push

Trump Deportation : అమెరికాలో విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం అల్లిమేటం జారీ చేసింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్.

దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికి మరి పట్టుకుని వెనక్కి పంపుతున్నారు. ప్రత్యేకించి టూరిస్టు వీసాలతో అక్రమంగా వచ్చిన వారిని, చదువు పేరుతో అక్రమంగా అక్కడే నివాసముండేవారిని బలవంతంగా అమెరికా నుంచి పంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం మరోసారి అగ్రరాజ్యంలోని విదేశీ పౌరులకు గట్టి హెచ్చరించింది.

Read Also : SWP Calculator : కోట్లు సంపాదించే పథకం.. ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. జీవితాంతం నెలకు రూ. 20వేలు సంపాదించవచ్చు..!

ఈ నెల 11 నుంచే కొత్త చట్టం అమల్లోకి.. :
అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులను 30 రోజుల్లోపు ప్రభుత్వంలో రిజిస్టర్ చేసుకోవాలని హెచ్చరించింది. ఏప్రిల్ 11 నుంచి కొత్త విదేశీయుల నమోదు చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. అమెరికాలో ఎక్కువకాలం ఉండే విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వ రికార్డుల్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

30 రోజులకు మించి ఉండే వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నెమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. మీకు మీరే ఇప్పుడే అమెరికా విడిచి వెళ్లిపోండి అంటూ అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

విమాన టికెట్‌లో రాయితీ కూడా ఇస్తాం :
కొత్త చట్టం ప్రకారం.. H-1B వీసా హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు వంటి చట్టబద్ధమైన నివాసితులతో సహా లక్షలాది మంది విదేశీ పౌరులు తమతో రిజిస్ట్రేషన్ రుజువును తీసుకెళ్లాలి. ఎవరికైనా విమాన టికెట్ డబ్బులు లేకపోతే.. వారికి విమాన టికెట్‌లో రాయితీ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

ఈ కొత్త నియమం ప్రధానంగా పత్రాలు లేని వలసదారులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. చట్టబద్ధమైన పౌరులు కానివారు కూడా ప్రభావితమవుతారు. వర్క్ వీసా, రీసెర్చ్ వీసాలు, గ్రీన్ కార్డులు లేదా ఇతర అధికారిక హోదా ఉన్నవారు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్టే పరిగణిస్తారు.

14 ఏళ్ల మైనర్లకు కూడా రిజిస్టర్ తప్పనిసరి :
అయినప్పటికీ 24 గంటలూ డాక్యుమెంటేషన్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం నుంచి మినహాయింపు పొందరు. ఇలాంటి కుటుంబాలలోని మైనర్లు కూడా 14 ఏళ్లు నిండిన తర్వాత తిరిగి రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే బయోమెట్రిక్ వివరాలను కూడా సమర్పించాలి.

“18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు కాని వారందరూ ఈ డాక్యుమెంటేషన్ (రిజిస్ట్రేషన్ ప్రూఫ్)ను ఎల్లప్పుడూ తీసుకెళ్లాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also : SBI vs HDFC vs ICICI : ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై భారీగా తగ్గిన వడ్డీరేట్లు.. FDపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేట్లు అందిస్తుందంటే?

విదేశీ పౌరులు అక్కడికి వెళ్లిన 10 రోజుల్లోపు అధికారులతో తమ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలని నిబంధన సూచిస్తోంది. అలా చేయడంలో విదేశీ పౌరులు విఫలమైతే 5వేల డాలర్ల వరకు జరిమానాతో పాటు 30 రోజుల వరకు జైలు శిక్ష, చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ స్టేటస్ కోల్పోవాల్సి వస్తుంది.