SBI vs HDFC vs ICICI : ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై భారీగా తగ్గిన వడ్డీరేట్లు.. FDపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేట్లు అందిస్తుందంటే?

SBI vs HDFC vs ICICI : ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు FD రేట్లను సవరించాయి.

SBI vs HDFC vs ICICI : ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై భారీగా తగ్గిన వడ్డీరేట్లు.. FDపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేట్లు అందిస్తుందంటే?

SBI vs HDFC vs ICICI

Updated On : April 13, 2025 / 5:43 PM IST

SBI vs HDFC vs ICICI : ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనగానే ఫ్యూచర్ సేవింగ్స్ ప్లాన్.. భవిష్యత్తులో సేవింగ్ విషయానికి వస్తే.. నేటికీ చాలా మందికి FD (ఫిక్సెడ్ డిపాజిట్) అనేది ఫస్ట్ ఆప్షన్. దీనికి కారణం ఏమిటంటే.. ఎవరైనా సరే చాలా సులభంగా ఓపెన్ చేయొచ్చు.

Read Also : Jio Annual Plan : జియో బంపర్ ఆఫర్.. ఈ రీచార్జ్ ప్లాన్‌తో 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ కాల్స్, OTT బెనిఫిట్స్.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

అవసరమైనప్పుడు డిపాజిట్ చేసిన FD మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడం చాలా సులభం. ఏప్రిల్ 9న ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించి 6 శాతానికి ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ తర్వాత చాలా బ్యాంకులు తమ FD రేట్లను సవరించాయి.

దేశంలోని 3 పెద్ద బ్యాంకులైన SBI, HDFC, ICICI బ్యాంక్‌లలో రిటైల్ FD వడ్డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం, భారత్‌లో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC బ్యాంక్, డిపాజిటర్ వయస్సు, కాలపరిమితి ఆధారంగా రూ. 3 కోట్ల కన్నా తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం వరకు FD రేట్లను అందిస్తోంది. ICICI బ్యాంక్ 7.85 శాతం వరకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 7.50 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.

ఏప్రిల్ 1 నుంచి రూ. 3 కోట్ల కన్నా తక్కువ ఎఫ్‌డీలపై HDFC బ్యాంక్ వడ్డీ రేట్లు :

  • 7 రోజుల నుంచి 14 రోజుల వరకు : 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 15 రోజుల నుంచి 29 రోజుల వరకు : 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజులు : 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజులు : 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం
  • 61 రోజుల నుంచి 89 రోజులు : 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం
  • 90 రోజుల నుంచి 6 నెలల కన్నా తక్కువ : 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం
  • 6 నెలల ఒక రోజు నుండి 9 నెలల కన్నా తక్కువ : 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 9 నెలల ఒక రోజు నుంచి ఒక ఏడాది కన్నా తక్కువ : 6 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
  • ఒక ఏడాది నుంచి 15 నెలల కన్నా తక్కువ కాలానికి : 6.60శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కన్నా తక్కువ కాలానికి : 7.10శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం
  • 18 నెలల నుంచి 21 నెలల కన్నా తక్కువ : 7.25శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
  • 21 నెలల నుంచి 2 ఏళ్ల వరకు : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 2 ఏళ్ల ఒక రోజు నుంచి 2 ఏళ్ల 11 నెలల కన్నా తక్కువ : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 2 ఏళ్ల 11 నెలల నుంచి 35 నెలల వరకు : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 2 ఏళ్ల 11 నెలల ఒక రోజు నుంచి 3 ఏళ్ల లేదా అంతకంటే తక్కువ : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 3 ఏళ్ల ఒక రోజు నుంచి 4 ఏళ్ల 7 నెలల కన్నా తక్కువ : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 4 ఏళ్ల 7 నెలల నుంచి 55 నెలల వరకు : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 4 ఏళ్ల 7 నెలలు ఒక రోజు నుంచి 5 ఏళ్ల కన్నా తక్కువ లేదా సమానం : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల వరకు : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం

3 కోట్ల కన్నా తక్కువ FDలపై SBI వడ్డీ రేటు :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో రూ. 3 కోట్ల కన్నా తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 15, 2025 నుంచి అమలులోకి వస్తాయి.

  • 7 రోజుల నుంచి 45 రోజులు : 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజులు : 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజులు : 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం
  • 211 రోజుల నుంచి 1 ఏడాది కన్నా తక్కువ : 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం
  • 1 ఏడాది నుంచి 2 ఏళ్ల కన్నా తక్కువ : 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
  • 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కన్నా తక్కువ : 6.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం
  • 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల కన్నా తక్కువ : 6.75శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం
  • 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు : 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం

ఏప్రిల్ 11 నుంచి ICICI బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల కన్నా తక్కువ.

Read Also : SWP Calculator : కోట్లు సంపాదించే పథకం.. ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. జీవితాంతం నెలకు రూ. 20వేలు సంపాదించవచ్చు..!

  • 7 రోజుల నుండి 29 రోజుల వరకు : 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజులు : 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజులు : 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
  • 61 రోజుల నుంచి 90 రోజులు : 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం
  • 91 రోజుల నుంచి 184 రోజులు : 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
  • 185 రోజుల నుంచి 270 రోజులు : 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 271 రోజుల నుంచి 1 ఏడాది కన్నా తక్కువ : 6శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
  • 1 ఏడాది నుంచి 15 నెలల కన్నా తక్కువ : 6.70శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కన్నా తక్కువ : 7.25శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం
  • 18 నెలల నుంచి 2 ఏళ్ల వరకు : 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
  • 2 ఏళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల వరకు : 6.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం
  • 5 ఏళ్ల టాక్స్ సేవర్ ఎఫ్‌డీ : 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం